పుష్ప టీజర్‌పై చిరంజీవి రియాక్షన్‌ ఇదే‌

8 Apr, 2021 13:41 IST|Sakshi

‘ఆర్య’, ‘ఆర్య 2’ చిత్రాల తర్వాత అల్లు అర్జున్, సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. రష్మికా మందన్న హీరోయిన్‌. నవీన్‌ ఎర్నేని, వై. రవి శంకర్‌ నిర్మిస్తున్నారు. ఎర్రచందనం స్మంగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ లారీ డ్రైవర్‌గా కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో బన్నీ జోడీగా .. గిరిజన యువతిగా రష్మిక నటిస్తోంది. ఇక అల్లు అర్జున్‌ పుట్టిన రోజు (ఏప్రిల్‌ 8) పురస్కరించుకుని బుధవారం హైదరాబాద్‌లో ‘పుష్ప’ సినిమా టీజర్‌ను విడుదల చేశారు.

బన్నీ పాత్రను హైలైట్ చేస్తూ కట్ చేసిన ఈ టీజర్, యూ ట్యూబ్ లో దూసుకెళ్తోంది. విడుదలైన కొన్ని గంటలకే లక్షల్లో లైకులను, వ్యూస్‌ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా టీజర్‌పై తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి స్పందించారు. ‘పుష్ప టీజర్‌ చూశాను. చాలా రియలిస్టిక్ అండ్ రస్టిక్ గా ఉంది. అలాగే పుష్పరాజ్ గా అల్లు అర్జున్‌ 'తగ్గేదే లే' .. అంటూ ట్వీట్ చేశారు. బన్నీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం.. ఆగస్ట్‌ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు