Chiranjeevi: ఆ విషయంలో తెలుగు దర్శకులకు చిరు చురకలు..

25 Jul, 2022 13:23 IST|Sakshi

Chiranjeevi Shocking Comments On Tollywood Directors: బాలీవుడ్ మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ ఆమిర్‌ ఖాన్‌, కరీనా కపూర్‌ జోడిగా నటించిన చిత్రం 'లాల్‌సింగ్‌ చద్దా'. హాలీవుడ్‌ మూవీ 'ఫారెస్ట్‌ గంప్‌'కు రీమేక్‌గా వస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్ గుడ్‌ బాయ్‌ నాగ చైతన్య కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు అద్వైత్ చందన్‌ దర్శకత్వం వహించారు.  చిత్రం ఆగస్టు 11న విడుదల కానుంది. అలాగే ఈ చిత్రాన్ని తెలుగులో మెగాస్టార్‌ చిరంజీవి సమర్పిస్తున్నారు. తాజాగా ఈ మూవీ తెలుగు ట్రైలర్‌ లాంచ్‌ ఆదివారం (జులై 24) గ్రాండ్‌గా జరిగింది. ఈ ఈవెంట్‌లో ట్రైలర్‌ లాంచ్‌ చేసిన చిరంజీవి టాలీవుడ్ దర్శకులను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో అమీర్ ఖాన్‌ నటన గురించి ఎంతో గొప్పగా చెప్పారు. అమీర్‌లా తమకు చేయాలని ఉన్నా పలు పరిధుల వల్ల తాము చేయలేకపోతున్నామని చిరు చెప్పిన విషయం తెలిసిందే. 

అలాంటి పరిధుల గురించి ఈ కార్యక్రమంలో చిరంజీవి తెలిపినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పలువురు టాలీవుడ్‌ డైరెక్టర్లకు చురకలు అంటించారు. ''కొందరు డైరెక్టర్లు షూటింగ్ స్పాట్‌లో అప్పటికప్పుడు డైలాగ్‌లు ఇస్తున్నారు. ఇది నటులను చాలా ఇబ్బంది పెడుతోంది. నాకు కూడా చాలా సార్లు ఇలాంటి అనుభవం ఎదురైంది. స్క్రిప్ట్‌ విషయంలో డైరెక్టర్లు మరింత శ్రమించాలి. స్క్రిప్ట్‌ గురించి మిగతా టెక్నిషియన్స్‌కు ముందుగానే తెలిస్తే వారు పనిచేసే విధానం వేరు. దానికి వచ్చే ఫలితం వేరేలా ఉంటుంది. ఆ ఫలితం సినిమాపై చూపిస్తుంది.

చదవండి: చిరంజీవికి పానీపూరి తినిపించిన అమీర్ ఖాన్‌..
అప్పుడెందుకు గుర్తుకు రాలేదు.. చిరుపై అమీర్ ఖాన్‌ వ్యాఖ్యలు

ఏమైపోయిందంటే.. సినిమాలో ప్రధాన హీరోకు సీన్స్‌ తెలుసేమో గానీ, అప్పుడే వచ్చిన కమెడియన్స్‌కు గానీ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌లకు మాత్రం తెలియదు.  అప్పటికప్పుడు ఆ డైలాగ్‌లు చెప్పి చేయించడంతో ఇన్వాల్వ్‌మెంట్‌ అంతంతమాత్రంగానే ఉంటుంది. అందుకే వర్క్‌షాప్‌లు నిర్వహించాలి.  ముందుగా డైలాగ్‌లు ఇవి అని చెప్పాలి. ఆ డైలాగ్‌లు ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్‌ చేయాలి. గదిలో రౌండ్‌టేబుల్‌పై కూర్చొని ఆ సీన్లు అనుకుని వాళ్లు గనుక చేయగలిగితే తర్వాత సెట్స్‌కు వెళ్లాక నా డైలాగ్‌ ఏంటని.. అది ఎలా గుర్తుంచుకోవాలని.. డైలాగ్‌ గుర్తుపెట్టుకోవండపై మనసు పెట్టక్కర్లేదు. అప్పుడు కేవలం నటనపైనే మనసు పెడితే చాలు. అది రావాలి. ఇదే వారు చేసేది (అమీర్‌ ఖాన్‌ గురించి)'' అని చిరంజీవి పేర్కొన్నారు. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

చదవండి: తన సినిమానే చూస్తూ నిద్రపోయిన స్టార్ హీరోయిన్‌..
అతని ప్రేయసి గురించి చెప్పేసిన చిరంజీవి..

మరిన్ని వార్తలు