పెళ్లి డేట్‌ ప్రకటించిన కమెడియన్లు

20 Apr, 2021 08:56 IST|Sakshi

"ద కపిల్‌ శర్మ షో" గురించి మీకు తెలిసే ఉంటుంది. నవ్వుల్ని పంచే ఈ కామెడీ ప్రోగ్రాం హిందీలో బాగా ఫేమస్‌.. ఎందరో కమెడియన్లను ప్రేక్షకులకు పరిచయం చేసిందీ షో. ఈ షోలో పార్టిసిపేట్‌ చేసిన సుగంధ మిశ్రా తాజాగా ఓ గుడ్‌న్యూస్‌ చెప్పింది. కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నానోచ్‌.. అంటూ పెళ్లి డేట్‌ ప్రకటించింది. ఈ మేరకు కాబోయే భర్త, టాప్‌ కమెడియన్‌ సంకేత్‌ భోస్లేతో కలిసి ఉన్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. డిసెంబర్‌ నుంచే పెళ్లిపనులు మొదలుపెట్టానని, ఆన్‌లైన్‌లో పెళ్లి షాపింగ్‌ కూడా పూర్తైంది అని తెలిపింది.

"మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. ఎంతో ఉద్వేగంగా, గర్వంగా ఉంది.. ఏప్రిల్‌ 26న కొత్త బంధంలోకి అడుగు పెడుతున్నా.." అని రాసుకొచ్చింది. దీంతో పలువురు సెలబ్రిటీలు, అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక ఈ మధ్యే ఆమె సంకేత్‌తో పెళ్లికి సిద్ధమవుతున్నట్లు జంటగా దిగిన ఫొటోలను సైతం సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. కాగా వీళ్లిద్దరూ కొంతకాలంగా ప్రేమలో మునిగి తేలుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇదే నిజమని తేల్చుతూ ఇద్దరూ పెళ్లి పీటలెక్కుతున్నారు. నిశ్చితార్థం, పెళ్లి రెండూ.. ఏప్రిల్‌ 26వ తారీఖునే జరగనున్నట్లు ఈ జంట మీడియాకు వెల్లడించింది. ఇక సంకేత్‌ డాక్టర్‌ కావడంతో కోవిడ్‌ నిబంధనల మధ్య అతి తక్కువ మంది సమక్షంలో పంజాబ్‌లోని లూధియానాలో తమ వివాహం జరుగుతుందని వెల్లడించాడు.

A post shared by 𝐒𝐔𝐆𝐀𝐍𝐃𝐇𝐀 𝐌𝐈𝐒𝐇𝐑𝐀 (@sugandhamishra23)

చదవండి: 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు