మహా శివరాత్రికి వస్తున్న ''ఊ అంటావా మావా ఊఊ అంటావా మావ''

5 Feb, 2023 19:19 IST|Sakshi

యశ్వంత్, రాకింగ్‌ రాకేష్, అనన్య, హిందోలా చక్రవర్తి, పూజ, సిమ్రాన్‌ ప్రధాన పాత్రలతో తెరకెక్కించిన చిత్రం 'ఊ అంటావా మావా ఊఊ అంటావా మావ'.  రేలంగి నరసింహా రావు దర్శకత్వం వహించారు. కామెడీ హారర్‌ చిత్రాన్ని తుమ్మల ప్రసన్న కుమార్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మహా శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 18 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. 

ఈ సందర్బంగా నిర్మాత తుమ్మల ప్రసన్న కుమార్‌ మాట్లాడుతూ. .'ఈ సినిమాను కశ్మీర్, హైదరాబాద్‌లో షూట్ చేశాం. మంచి అద్భుతమైన కంటెంట్‌తో తెరకెక్కించాం. రేలంగి నరసింహారావు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. తను ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీకి 76 సూపర్‌ హిట్స్‌ ఇచ్చాడు. ఇందులో మంచి అద్భుతమైన కామెడీ హారర్ ఉంది. జబర్దస్త్ రాకింగ్ రాకేష్ బిజీగా ఉన్నా తను ఈ చిత్రంలో మంచి కామెడీ పండించాడు. ఈ సినిమాలో నటించిన యశ్వంత్, రాకింగ్‌ రాకేష్, అనన్య, హిందోలా చక్రవర్తి, పూజ, సిమ్రాన్‌ ఫుల్ సపోర్ట్ చేయడంతో సినిమా బాగా వచ్చింది. తెలుగు ప్రేక్షకులు హార్రర్,థ్రిల్లర్ కామెడీ సినిమాలు ఎప్పుడొచ్చినా ఆదరిస్తారు. మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 18న రిలీజ్ చేస్తున్నాం.' అని అన్నారు. 

మరిన్ని వార్తలు