నటి మనోరమ ఐదుగురు సీఎంలతో నటించిందన్న విషయం మీకు తెలుసా?

27 May, 2021 17:57 IST|Sakshi

ప్రముఖ నటి మనోరమ 12 ఏళ్ల వయసులోనే నటనా ప్రస్థానాన్ని ప్రారంభించి ఎన్నో సూపర్ హిట్‌ చిత్రాల్లో నటించింది. 1937 మే26న తమిళనాడులో జన్మించిన ఆమె చిన్న వయసులోనే వెయ్యికి పైగా నాటక ప్రదర్శనలు ఇచ్చి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. తమిళం, కన్నడ, తెలుగు, హిందీ సహా పలు భాషల్లో సుమారు 1500 సినిమాల్లో ఎంతోమంది అగ్ర నటులతో కలిసి నటించింది. 1987లో ప్రపంచంలోనే అత్యధిక సినిమాలలో నటించిన సినీ నటిగా  గిన్నీస్ బుక్‌లో స్థానం సంపాదించింది.  2009 వరకూ ఈ రికార్డును ఎవరూ అధిగమించలేదు.

ఉత్తమ సహాయ నటిగా జాతీయ పురస్కారం సహా పద్మశ్రీ అవార్డును సొంతం చేసుకుంది. అభిమానులు ఈమెను ఎంతో ప్రేమగా ‘ఆచి’ అని పిలుస్తారు. ఇక మనోరమ తన నటనా జీవితంలో ఏకంగా ఐదుగురు ముఖ్యమంత్రులతో కలిసి నటించింది. వారిలో తమిళనాడు మాజీ సీఎంలు జయలలిత, అన్నాదురై, ఎం.జి.రామచంద్రన్, కరుణానిధి సహా ఆంధ్రప్రదేశ్‌ మాజీ సీఎం నందమూరి తారకరామారావు ఉన్నారు. అదే విధంగా ప్రముఖ నటులు శివాజీ గణేశన్, రజనీకాంత్, కమల్‌హాసన్‌ సహా ఎంతో మంది అగ్ర నటులతో నటించారు. గుండెపోటుతో 2015 అక్టోబర్‌ 10న ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మనోరమ కన్నుమూశారు. 

చదవండి: 
ఆ వార్తలను నమ్మకండి : నటుడు చంద్రమోహన్‌

ఇంకా నటించాలనుంది కానీ..: రజనీకాంత్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు