RGV Tweet: ఆ హామీ ఇస్తే ఇప్పుడే అందరూ చస్తారు: ఆర్జీవీ ట్వీట్ వైరల్

18 Dec, 2022 15:50 IST|Sakshi

అవతార్-2: ది వే ఆఫ్ వాటర్ జేమ్స్‌ కామెరూన్‌ సృష్టించిన అద్భుత ప్రపంచం. సముద్రంలో ఆయన సృష్టించిన ప్రపంచం చూస్తే అశ్చర్యపోకుండా ఉండలేరు. అంటూ అవతార్‌-2 పై ప్రశంసల వర్షం కురిపించారు సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్. సినిమాలోని ప్రతి సీన్ కట్టిపడేసేలా చేసిందని ఆయన అన్నారు. దేవుడు ఈ విశ్వాన్ని సృష్టిస్తే.. కామెరూన్‌ ‘పండోరా’ అనే అద్భుత ప్రపంచాన్ని ఆవిష్కరించాడని కొనియాడారు.

ప్రపంచవ్యాప్తంగా విడుదలైన అవతార్‌-2 చిత్రంలో జేమ్స్ కామెరూన్ అందమైన నీటి ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు. అద్భుతమైన విజువల్స్‌, ఆకట్టుకునే ప్రదర్శన, ఊపిరి బిగబెట్టేలా యాక్షన్‌ సీన్లతో థియేటర్లను ఊపేశారు. దేవుడు ఈ భూమిని సృష్టిస్తే.. పండోరా అనే అందమైన ప్రపంచాన్ని జేమ్స్‌ కామెరూన్‌ క్రియేట్‌ చేశాడని రామ్‌ గోపాల్ వర్మ ప్రశంసలతో ముంచెత్తారు. 

 ఆర్జీవీ తన ట్వీట్‌లో రాస్తూ..'ఈ ప్రపంచంలో నివసించాలని ఉంది. కానీ అవతార్‌-2 చూశాక స్వర్గం అంటే పండోరా ప్రపంచంలా ఉంటుందని ఎవరైనా హామీ ఇస్తే.. మనుషులందరూ ఇప్పుడే చచ్చిపోతారు' అంటూ పోస్ట్ చేశారు. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. 2009లో విడుదలైన అవతార్‌ సీక్వెల్‌గా హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. శుక్రవారం విడుదలైన ఈ సినిమా తొలి రోజే హిట్‌ టాక్ తెచ్చుకుంది. ఇదొక విజువల్‌ వండర్‌ అని పలువురు ప్రశంసించారు.


 

మరిన్ని వార్తలు