Bigg Boss 6 Telugu: గ్రాండ్‌ ఫినాలేలో సందడి చేయనున్న సెలబ్రిటీలు

18 Dec, 2022 15:33 IST|Sakshi

బిగ్‌బాస్‌ తెలుగు ఆరో సీజన్‌ ఎంత గ్రాండ్‌గా ప్రారంభమైందో అంతే గ్రాండ్‌గా ముగియనుంది. మరికొద్ది గంటల్లో ఫినాలే ఎపిసోడ్‌ మొదలుకానుంది. ఈ ఎపిసోడ్‌ ఏ రేంజ్‌లో ఉండబోతోందో సాంపుల్‌ చూపించేందుకు తాజాగా ప్రోమో వదిలారు. ఇందులో మాజీ కంటెస్టెంట్ల డ్యాన్సులతో పాటు హీరోయిన్స్‌ స్పెషల్‌ డ్యాన్సులు కూడా ఉండనున్నాయి. అలాగే నిఖిల్‌, ధమాకా టీమ్‌ రవితేజ, శ్రీలీల కూడా స్టేజీపై సందడి చేసినట్లు తెలుస్తోంది.

తర్వాత మాస్‌ మహారాజకు బ్రీఫ్‌కేస్‌ ఇచ్చి హౌస్‌ లోపలకు పంపించారు. కానీ ఫైనలిస్టులు ఎవరూ దాన్ని అందుకోవడానికి రెడీగా లేనట్లు కనిపించింది. ఇకపోతే ఎలాగో రేవంత్‌ విజేతగా అవతరించగా శ్రీహాన్‌ రన్నర్‌గా నిలిచాడంటూ సోషల్‌ మీడియా కోడై కూస్తోంది. మూడో స్థానంలో ఆదిరెడ్డి ఉన్నాడని మొదట పుకార్లు వ్యాపించినప్పటికీ ప్రస్తుతం నడుస్తున్న టాక్‌ ప్రకారం కీర్తి సెకండ్‌ రన్నరప్‌గా నిలిచిందట. ఆదిరెడ్డి నాలుగో స్థానంతో, రోహిత్‌ ఐదో స్థానంతో సరిపెట్టుకున్నట్లు తెలుస్తోంది.

చదవండి: రూ. 5 లక్షలు పట్టేసిన శ్రీహాన్‌

మరిన్ని వార్తలు