Farah Khan: నా జీవితంలో అదో పీడకల: ఫరా ఖాన్

29 Jan, 2023 18:55 IST|Sakshi

బాలీవుడ్ చిత్రనిర్మాత, కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేసింది. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు కరణ్‌ జోహార్‌ను ఉద్దేశించి వ్యంగ్యాస్త్రాలు సంధించింది. తాజాగా కరణ్ డ్రెస్సింగ్ స్టైల్‌పై ఆమె మాట్లాడారు. కరణ్ తాను కొరియోగ్రఫీ చేసిన పాటల్లో బ్యాక్‌గ్రౌండ్‌ డ్యాన్సర్‌ల మాదిరిగానే డ్రెస్‌ వేసుకుంటాడని చెప్పుకొచ్చింది. ఫరా ఖాన్ ఇటీవల కరణ్‌ జోహార్‌తో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్న సంఘటనను గుర్తు చేసుకుంది.

ఫరా ఖాన్ కొద్ది రోజుల క్రితమే దుబాయ్‌లో జరిగిన ఓ హోటల్ లాంఛ్‌ కార్యక్రమంలో హాజరయ్యారు. ఈవెంట్‌లో ఆమె ధరించిన దుస్తులపై కరణ్ ఎలా స్పందిస్తారని అడగ్గా..' కరణ్ జోహార్ తనను మనీష్ మల్హోత్రా బృందంలో చూస్తే షాక్ అవుతారని చెప్పింది. నా చెత్త రెడ్ కార్పెట్ పీడకల ఏమిటంటే అందులో కరణ్ కనిపించడం. అతను నేను కొరియోగ్రఫీ చేసిన పాటల్లో  ఎప్పుడూ బ్యాక్ గ్రౌండ్ డ్యాన్సర్ లాగా దుస్తులు ధరిస్తాడు.' అంటూ నవ్వుతూ చెప్పింది.

ఫరా ప్రస్తుతం రాబోయే ప్రాజెక్ట్‌లో పని చేస్తోంది. ఆమె చివరిగా దర్శకత్వం వహిచిన 2014 చిత్రం హ్యాపీ న్యూ ఇయర్. ఇందులో షారూఖ్ ఖాన్, దీపికా పదుకొనే, బోమన్ ఇరానీ, సోనూ సూద్, వివాన్ షా నటించారు. సల్మాన్ ఖాన్ తన రాబోయే చిత్రానికి పని చేయడానికి విరామంలో ఉన్నందున ఆమె ప్రస్తుతం బిగ్ బాస్ 16కి హోస్ట్‌గా వ్యవహరిస్తోంది.
 

మరిన్ని వార్తలు