తెలుగులో నటించాలని ఉంది, కానీ..: ఫర్హాన్‌ అక్తర్‌

14 Jul, 2021 20:43 IST|Sakshi

బాలీవుడ్‌ నటుడు, డైరెక్టర్‌ ఫర్హాన్‌ అక్తర్‌కు తెలుగు నటించాలని ఉందని, కానీ తనకు ఇప్పటి వరకు ఒక్క ఆఫర్‌ కూడా రాలేదంటూ విచారం వ్యక్తం చేశాడు. కాగా ఆయన నటించిన తాజా చిత్రం తుఫాన్ ఈ నెల 16న ఓటీటీ సంస్థ అమెజాన్‌ ప్రైంలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఫర్హాన్‌ ఓ జాతీయ మీడియాతో ఆన్‌లైన్‌లో ముచ్చటించాడు. ఈ నేపథ్యంలో ఫర్హాన్‌ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. టాలీవుడ్‌ పరిశ్రమపై ఆయన ప్రశంసలు కురిపించాడు. ఈ మేరకు ఫర్హాన్‌ ‘నాకు తెలుగు సినిమా నటించాలని చాలా ఆసక్తిగా ఉంది. కాని ఆఫర్స్‌ రావడం లేదు. నా దగ్గరకు ఒక మంచి పాత్ర వస్తే తెలుగులో నటించేందుకు సిద్దంగా ఉన్నాను. ఈ మధ్యకాలంలో తెలుగులో మంచి సినిమాలు వస్తున్నాయి’ అంటూ ఫర్హాన్‌ టాలీవుడ్‌ను కొనియాడాడు. 

అయితే తుఫాన్‌ మూవీ గురించి మాట్లాడుతూ.. ‘తుఫాన్‌ కథ నాకు బాగా నచ్చింది. గతంలో నేను నటించిన బయోపిక్‌ భాగ్‌ మిల్కా భాగ్‌ మూవీ నుంచి డైరెక్టర్‌ రాకేష్‌ ఓం ప్రకాష్‌ మంచి సన్నిహితుడయ్యాడు. అయితే రాకేష్‌ తన దగ్గర మరో స్పోర్ట్స్‌ డ్రామా ఉందని నాతో చెప్పడంతో చాలా ఎక్జయిట్‌ అయ్యాను. ఈ మూవీ స్క్రిప్ట్‌ వివరించి, బాక్సార్‌ అజీజ్‌ అలీ రోల్‌ గురించి చెప్పగానే వెంటనే సినిమా ఓకే చెప్పాను’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉండగా యాంకర్‌ తన డైరెక్షన్‌లో వచ్చే తదుపరి చిత్రం ఎంటని ప్రశ్నించగా.. ప్రస్తుతం తన దగ్గర మంచి కథ ఉందని, ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభించాలని ఇప్పటికే ప్లాన్‌ చేశానన్నాడు. అయితే కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా వాయిదా వేసినట్లు చెప్పాడు. త్వరలోనే ఈ మూవీని సెట్స్‌పై తీసుకొస్తానని, స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతున్నట్లు ఫర్హాన్‌ పేర్కొన్నాడు.

మరిన్ని వార్తలు