రిలీజ్‌కు రెడీ అయిన 'గీతా సాక్షిగా'.. ఎప్పుడంటే?

7 Mar, 2023 21:49 IST|Sakshi

ఆద‌ర్శ్‌, చిత్రా శుక్లా జంట‌గా న‌టించిన  చిత్రం ‘గీత సాక్షిగా’. నిజ జీవిత సంఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందించారు. చేత‌న్ రాజ్ ఫిలింస్ బ్యాన‌ర్‌పై ఈ సినిమాను నిర్మించారు. ఆంథోని మ‌ట్టిప‌ల్లి దర్శకత్వం వహించగా.. గోపీ సుంద‌ర్ ఈ మూవీకి సంగీతాన్ని అందించారు. ఇటీవ‌ల విడుద‌లైన మూవీ ఫ‌స్ట్‌లుక్‌, టీజ‌ర్‌, సాంగ్‌కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రాన్ని ఈనెల 22న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. హోలీ సంద‌ర్భంగా ప్రేక్ష‌కులంద‌రికీ హోలీ శుభాకాంక్ష‌ల‌ను తెలియ‌జేస్తూ  పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమాను మార్చి  తెలుగు, హిందీ భాష‌ల్లో విడుద‌ల చేయ‌నున్నారు. 

మేకర్స్ మాట్లాడుతూ..' గీత సాక్షిగా చిత్రం తెలుగుతో పాటు హిందీలోనూ రిలీజ్ అవుతోంది. మంచి సినిమాలను ప్రేక్ష‌కులు ఎప్ప‌టికీ ఆద‌రిస్తార‌నే నమ్మకం ఉంది. ఇప్పుడు నిజ జీవిత సంఘటనల ఆధారంగా ప్రేక్షకులకు మంచి కంటెంట్ అందిస్తున్నట్లు కనిపిస్తోంది. సినిమాలో చ‌రిష్మా కీ రోల్ పోషించింది. ఆమె చుట్టూనే సినిమా క‌థాంశం తిరుగుతుంటుంది.' అని తెలిపారు. కాగా.. ఈ చిత్రంలో శ్రీకాంత్ అయ్యంగార్‌, రూపేష్ శెట్టి, చ‌రిష్మా, భ‌ర‌ణి శంక‌ర్‌, జ‌య‌ల‌లిత‌, అనితా చౌద‌రి, రాజా ర‌వీంద్ర త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. 

మరిన్ని వార్తలు