సుల్తాన్‌ సినిమాలో అవన్నీ ఉన్నాయి

2 Apr, 2021 03:14 IST|Sakshi
ఎస్‌ఆర్‌ ప్రభు, రాధామోహన్, బక్కియరాజ్, కార్తీ, రష్మికా, వంశీ, వరంగల్‌ శ్రీను

– కార్తీ

‘‘మహాభారతంలో కృష్ణుడు పాండవుల వైపున కాకుండా కౌరవుల పక్షాన ఉంటే ఎలా ఉంటుంది? అనే ఒక చిన్న పాయింట్‌ తీసుకుని ‘సుల్తాన్‌’ సినిమా చేశాం. వందమంది అన్నయ్యలు ఉన్న ఓ తమ్ముడి కథే ఈ చిత్రం’’ అని కార్తీ అన్నారు. బక్కియరాజ్‌ కణ్ణన్‌  దర్శకత్వంలో కార్తీ, రష్మికా మందన్నా జంటగా రూపొందిన చిత్రం ‘సుల్తాన్‌’. ఈ చిత్రం నేడు విడుదల అవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో కార్తీ మాట్లాడుతూ – ‘‘నా ‘ఖైదీ’ చిత్రంలో ఉన్న యాక్షన్, ‘ఊపిరి’లో ఉన్న కామెడీ, ‘ఆవారా’లో ఉన్న లవ్‌స్టోరీ, రొమాన్స్‌.. అన్నీ ‘సుల్తాన్‌’లో ఉన్నాయి. ‘వైల్డ్‌డాగ్‌’ సినిమాతో పాటు మా ‘సుల్తాన్‌ ’  కూడా విజయం సాధించాలని కోరుకున్న మా అన్నయ్య నాగార్జునగారికి ధన్యవాదాలు. నాగార్జునగారిలా విభిన్నమైన సినిమాలు చేయడం కష్టం’’ అని అన్నారు. ‘‘నేను డైరెక్ట్‌ చేసిన ‘ఊపిరి’  సినిమాలో నాగార్జునగారు, కార్తీ నటించారు.

ఐదేళ్ల తర్వాత వీరి సినిమాలు ఒకే రోజున (ఏప్రిల్‌ 2) విడుదలవుతున్నాయి. ‘వైల్డ్‌డాగ్‌’, ‘సుల్తాన్‌’... ఈ రెండు సినిమాలు సక్సెస్‌ కావాలని కోరు కుంటున్నాను’’ అన్నారు దర్శకుడు వంశీ పైడిపల్లి. ‘‘నాకు తెలుగు సినిమాలంటే చాలా ఇష్టం. చాలామంది తెలుగు హీరోలకు నేను అభిమానిని. ‘సుల్తాన్‌’ ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌’’అన్నారు దర్శకుడు. ‘‘సుల్తాన్‌’ సినిమాలో ఎంటర్‌టైన్‌ మెంట్, ఎమోషన్స్‌ ఉన్నాయి. ఆడియన్స్‌ సినిమాను బాగా ఎంజాయ్‌ చేస్తారు’’ అన్నారు నిర్మాతల్లో ఒకరైన ఎస్‌.ఆర్‌. ప్రభు. ‘‘సుల్తాన్‌’ పెద్ద సక్సెస్‌ కావాలి’’ అన్నారు ప్రముఖ నిర్మాత కేకే రాధామోహన్‌ . ‘‘తమిళంలో ‘సుల్తాన్‌’ నా తొలి సినిమా. కాస్త నెర్వస్‌గా, ఎగ్జయింటింగ్‌గా ఉంది’’ అన్నారు రష్మికా మందన్నా. ‘‘నిర్మాత ఎస్‌.ఆర్‌. ప్రభు కాన్సెప్ట్‌ ఓరియంటెండ్‌ సినిమాలనే నిర్మిస్తారు. ‘ఖైదీ’, ‘ఖాకీ’లే అందుకు ఓ ఉదాహరణ. ‘సుల్తాన్‌’ కూడా హిట్‌ అవుతుంది’’ అన్నారు ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్‌ ‘వరంగల్‌’ శీను.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు