‘లెహరాయి’ పెద్ద హిట్‌ అవ్వాలి: కార్తికేయ

7 Dec, 2022 16:02 IST|Sakshi

‘కొత్తగా వచ్చే సినిమాలు ఎంత హిట్‌ అయితే అంతమంది కొత్త నటీనటులు ఇండస్ట్రీకి వస్తారు. ఎంతమంది కొత్తవాళ్లు వస్తే ఇండిస్ట్రీ అంత బాగుంటుంది. లెహరాయి చిత్రం పెద్ద హిట్‌ కావాలని కోరుకుంటున్నాను’ అని యంగ్‌ హీరో కార్తికేయ అన్నారు.  ప్రముఖ నిర్మాత బెక్కం వేణుగోపాల్ సమర్పణలో యంగ్ టాలెంటెడ్ హీరో రంజిత్, సౌమ్య మీనన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం లెహరాయి. డిసెంబర్ 9న లెహరాయి సినిమా విడుదలకానుంది.ఇందులో భాగంగా చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించింది ఈ చిత్ర బృందం.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన హీరో కార్తికేయ మాట్లాడుతూ.. ‘ఒక మంచి మూవీ ను సపోర్ట్ చేసే అవకాశం వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని అన్నారు. ‘ఈ సినిమాకు ఫస్ట్ ఆడియన్ వేణుగోపాల్‌ గారే. ఇది ఒక మంచి కథ. ఈ కథను  పూరి జగన్నాధ్ తీసిన, త్రివిక్రమ్ తీసిన అందరికి నచ్చుతుంది. అంత అద్భుతమైన కథ ఇది’ అని హీరో రంజిత్‌ అన్నారు. ‘ఈ సినిమాను చాలా మందికి చూపించాను. అందరు మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ఒక సినిమాకు కావాల్సిన అన్ని హంగులు లెహరాయిలో ఉన్నాయి. డిసెంబర్‌ 9న విడుదలయ్యే ఈ చిత్రాన్ని అందరూ ఆదరించాలి’అని నిర్మాత మద్దిరెడ్డి శ్రీనివాస్‌ అన్నారు.

మరిన్ని వార్తలు