Pushpa Meme: 'ఏదైనా మాస్క్‌ తీసేదేలే'.. తగ్గేదేలే డైలాగ్‌తో మంత్రిత్వ శాఖ మీమ్‌

19 Jan, 2022 21:00 IST|Sakshi

I And B Ministry Shares Meme On Allu Arjun Pushpa: ఎక్కడా చూసిన 'పుష్ప' ఫీవరే కనిపిస్తోంది. సామాన్యులు, తారలు, పోలీసులు 'పుష్ప' సినిమాలోని డైలాగ్‌లు, మ్యానరిజాన్ని స్పూఫ్‌, కవర్స్‌గా మలిచారు. పుష్ప చిత్రానికి వచ్చిన క్రేజ్‌తో ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన కల్పించారు. రకరకాల మీమ్స్‌ను రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్‌ చేస్తూ 'పుష్ప' ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. తాజాగా రాజకీయనాయకులు సైతం 'పుష్పరాజ్‌'ను బాగా వాడేసుకుంటున్నారు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కూడా కరోనా నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పుష్పరాజ్‌ డైలాగ్‌ను ఎంచుకుంది. ఈ డైలాగ్‌తో ఒక మీమ్ క్రియేట్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. 

(చదవండి: హెల్మెట్‌తో 'పుష్ప'రాజ్.. పోలీసుల అవగాహన)

కొవిడ్‌పై తాజా సమాచారాన్ని ప్రజలకు అందించేందుకు '#IndiaFightsCorona@COVIDNewsByMIB' అనే పేరుతో సమాచార మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా ఓ ట్విటర్ పేజీని ఇటీవల తీసుకొచ్చింది. ఈ ట్విటర్ అకౌంట్‌లో పుష్ప సినిమాలో అల్లు అర్జున్‌ స్టిల్‌ను ఎడిట్‌ చేసి బన్నీకి మాస్క్‌ పెట్టారు. ఈ ఎడిట్‌ చేసిన ఫొటోపై 'తగ్గేదేలే' డైలాగ్‌ను 'డెల్టా అయినా ఒమిక్రాన్‌  అయినా.. మాస్క్‌ తీసేదేలే..' అని రాశారు. ఇంకా ఆ పోస్ట్‌లో 'పుష్ప.. పుష్పరాజ్‌.. ఎవరైనా.. కరోనాపై మన పోరు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నాలుగు విషయాలను ఎప్పటికీ మర్చిపోవద్దు. ఎల్లప్పుడూ మాస్క్‌ ధరించాలి. తరచూ చేతులను శానిటైజర్‌తో శుభ్రపరచుకోవాలని. భౌతిక దూరాన్ని పాటించాలి. తప్పనిసరిగా వ్యాక్సిన్‌ వేయించుకోవాలి.' అని ట్వీట్‌ చేశారు. దీంతోపాటు 'పుష్ప' మూవీలోని హీరోహీరోయిన్లు అయినా బన్నీ, రష్మిక మందన్నాను ట్యాగ్‌ చేశారు. 
 


(చదవండి: ముంబైలో 'పుష్ప' ఫీవర్‌.. లోకల్‌ ట్రైన్‌లో శ్రీవల్లి హుక్ స్టెప్పు)

మరిన్ని వార్తలు