ఎన్టీఆర్‌ ఫోన్‌ చేసి తిట్టేవాడు.. నాలుగైదేళ్లు ముఖం చూపించకు అన్నాడు: జగపతి బాబు

16 Jan, 2022 08:37 IST|Sakshi

ఒకప్పుడు హీరోగా రాణించిన జగపతి బాబు.. లెజెండ్ సినిమాతో విలన్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో జగపతి బాబు క్రేజ్ అమాంతం పెరిగింది. వరుసగా విలన్ ఆఫర్లు క్యూ కట్టాయి. హీరోగా మెప్పించిన ఆయ‌న విల‌న్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా ఇప్పుడు రాణిస్తున్నారు. తనకు హీరో అనేది ట్యాగ్‌లైన్‌ మాత్రమేనని, ఒక నటుడిగా ఉండటమే ఇష్టమని చెబుతున్నాడు జగపతిబాబు.

ఇటీవల ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘అర‌వింద స‌మేత‌ వీర రాఘవ’ సినిమా గురించి, అందులో చేసిన బ‌సి రెడ్డి పాత్ర గురించి, హీరో ఎన్టీఆర్ గురించి ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు తెలియ‌జేశారు. ‘అరవింద సమేత వీర రాఘవ’స్క్రిప్ట్ బాగా కుదిరింది. అందులో నాది ఎగ్రసివ్‌ క్యారెక్టర్‌ అయితే.. తారక్‌ది చాలా కూల్‌ క్యారెక్టర్‌. దాంతో బసిరెడ్డి క్యారెక్టర్‌ బాగా ఎలివేట్‌ అయింది. అంత పెద్ద హీరో నా పాత్రను ఒప్పకోవడమే కష్టం. తారక్‌ యాటిట్యూడ్‌ బాగా నచ్చింది. అయితే బసిరెడ్డి పాత్రను ఒప్పుకున్న తారక్‌.. తర్వాత నాకు  కావాల్సినంత ప‌నిష్‌మెంట్ కూడా ఇచ్చేశాడు.

షూటింగ్‌ సమయంలో రోజూ ఫోన్‌ చేసి వాయించేవాడు. నీ పాత్ర ఇంత బావుంది. అంత బావుందనేవాడు. ర‌క ర‌కాలుగా తిట్టేవాడు.. అది కూడా ప్రేమ‌తోనే. సినిమా విడుదల తర్వాత జరిగిన ఫంక్షన్‌లో కూడా  నా గురించి మాట్లాడుతూ ఈ సినిమా చూసిన వారికి ముందు బ‌సిరెడ్డి గుర్తుంటాడు. త‌ర్వాతే నేను గుర్తుంటాను అన్నాడు. త‌ను అలా అన‌డం చాలా పెద్ద స్టేట్‌మెంట్‌. ఆ తర్వాత నన్ను దూరం పెడుతున్నానని చెప్పారు. ‘బాబు మీకు.. నాకు అయిపోయింది. మీతో ఇక  చేయలేను. మీరు తారక్‌తోనే ఆడుకుంటున్నారు కుదరదు. ఇక నాలుగైదేళ్లు మీ ముఖం చూపించ‌కండి’అని తారక్‌ అన్నారు. దానికి నేను ఓకే తారక్‌ అన్నాను. అయిపోయింది’అని జగపతి బాబు చెప్పుకొచ్చాడు. 

మరిన్ని వార్తలు