హల్‌ చల్‌ చేస్తున్న ‘జాతిరత్నాలు’ స్పెషల్‌ సాంగ్‌

20 Mar, 2021 11:44 IST|Sakshi

చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించిన సినిమా ‘జాతిరత్నాలు. కేవీ అనుదీప్‌ దర్శకత్వంలో నవీన్‌ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ ప్రధాన పాత్రధారులుగా నటించిన ఈ సినిమా .. బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తుంది.ముఖ్యంగా ఈ మూవీలోని కామెడీ స‌రికొత్త వినోదాన్ని పంచింది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ‘అర్రెరెరె జాతిరత్నాలు..ఎన్నడు చూడని నవ్వుల వర్షాలు..’అనే స్పెషల్‌ సాంగ్‌ని వైజయంతి నెట్‌వర్క్‌ సంస్థ తన యూట్యూబ్‌లో షేర్‌ చేసింది.

రామ్‌ మిర్యాల పాడిన ఈ పాట సోషల్‌ మీడియాలో దూసుకెళ్తుంది. ఈ పాటకు సంబంధించిన వీడియోలో సినిమా ప్రమోషన్స్‌కు సంబంధించిన విజువల్స్‌ని పంచుకున్నారు. స్వప్న సినిమాస్‌ పతాకంపై నాగ్‌ అశ్విన్‌ నిర్మించిన ఈ చిత్రంలో హైదరాబాద్‌ అమ్మాయి ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా, ఇతర కీలక పాత్రల్లో బ్రహ్మానందం, మురళీ శర్మ, వెన్నెల కిశోర్‌, బ్రహ్మజీ, తనికెళ్ల భరణి తదితరులు నటించారు. 


చదవండి:
చిట్టీ అని పిలుస్తుంటే భలేగా ఉంది
‘జాతి రత్నాలు’ ఫ్యాన్స్‌కు గుడ్‌‌ న్యూస్‌‌‌‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు