Kaikala Satyanarayana Health Update: తండ్రి ఆరోగ్యంపై కూతురు రమాదేవి ఆడియో సందేశం

23 Nov, 2021 13:11 IST|Sakshi

టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు కైకాల సత్యనారాయణ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. మూడు రోజుల క్రితం హైదరాబాద్‌ అపోలో ఆసుపత్రిలో చేరిన ఆయన​కు వైద్యులు వెంటిలెటర్‌పై చికిత్స అందిస్తున్నారు. అయితే ఆయన పరిస్థితి కాస్తా విషమంగా ఉందని, ఆయనను కాపాడేందుకు కృషి చేస్తున్నామంటూ రెండు రోజుల క్రితం అపోలో వైద్యులు హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేశారు.

చదవండి: కైకాల సత్యనారాయణకు వెంటిలేటర్‌పై చికిత్స

దీంతో ఆయన ఆరోగ్యంపై రకరకాలుగా పుకార్లు పుట్టుకొస్తున్నాయి, ఒక దశలో ఆయన పరిస్థితి విషమించిందని, పరిస్థితి చేచారిందంటూ సోషల్‌ మీడియాల్లో ప్రచారం మొదలు పెట్టారు. ఇక ఈ పుకార్లకు చెక్‌ పెడుతూ కైకాల కూతురు రమాదేవి ఓ ఆడియో సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె తన తండ్రి కోలుకుంటున్నారని, చికిత్సకు స్పందిస్తున్నట్లు వెల్లడించారు.

చదవండి: నిక్‌తో ప్రియాంక విడాకులు? తల్లి మధు చోప్రా క్లారిటీ

అంతేగాక తన తండ్రి కైకాల ఆరోగ్యం కొంత మెరుగుపడిందని, ప్రస్తుతం ఆయన మాట్లాడుతున్నట్లు ఆమె చెప్పారు. ఇక ఆయన ఆరోగ్యంపై అనవసరపు ప్రచారం చెయోద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. ఇక ఆయన ఆరోగ్యంపై వస్తున్న పుకార్లను కూడా ఎవరూ నమ్మోద్దని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవరం లేదని ఆమె స్పస్టం చేశారు. కాగా ప్రస్తుత సమాచారం ప్రకారం కైకాల సత్యనారాయణ అపోలోలోనే చికిత్స తీసుకుంటున్నారు. ఆయన చికిత్సకి స్పందిస్తున్నారు. త్వరలోనే కైకాల కోలుకుంటారని వైద్యులు చెప్తున్నారు.

మరిన్ని వార్తలు