హనీమూన్‌కు వెళుతున్న కొత్త జంట

7 Nov, 2020 14:38 IST|Sakshi

ముంబై : ప్రేమించిన ప్రియుడిని పెళ్లాడి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు టాలీవుడ్‌ హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌. గత వారం కాజల్‌ తన చిరకాల స్నేహితుడు గౌతమ్‌ కిచ్లును కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహామాడారు. ముంబైలోని ఓ హోటల్‌లో ఈ వేడుక గ్రాండ్‌గా జరిగింది. ప్రస్తుతం కాజల్‌ భర్త కిచ్లుతో ముంబైలో ఉన్నారు. కాగా  పెళ్లి అనంతరం కేవలం రెండు వారాలు మాత్రమే బ్రేక్‌ తీసుకొని మళ్లీ సినిమా షూటింగ్‌లో కాజల్‌ పాల్గొననున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో ఫిమేల్‌ లీడ్‌లో కాజల్‌ నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్‌లో కాజల్‌ మరో వారంలో తిరిగి జాయిన్‌ కానున్నారని, ఈ షెడ్యూల్డ్‌ పూర్తి అయిన తరువాత హనీమూన్‌ ప్లాన్‌ చేసుకోనున్నట్లు వదంతులు వ్యాపించాయి. చదవండి: కాజల్‌ అగర్వాల్‌ వెరీ వెరీ స్పెషల్‌

అయితే ఈ వార్తలకు భిన్నంగా కాజల్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. సినిమా షూటింగ్‌కు ముందే నూతన దంపతులు ఇద్దరు ఇప్పుడే హనీమూన్‌ ప్లాన్‌ చేసుకున్నారు. ఈ విషయాన్ని కాజల్‌ తన సోషల్‌ మీడియా అకౌంట్‌లో తెలిపారు. తాము హానీమూన్‌ వెళుతున్నట్లు శనివారం ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో పోస్టు చేశారు. త‌మ పేర్ల‌తో ఉన్న పౌచ్‌ల‌తో పాటు పాస్ట్ పోర్ట్‌ల‌ని షేర్‌ చేశారు. దీనికి ‘బ్యాగ్స్ ప్యాక్ చేసుకున్నాం.. రెడీ టూ గో’ అనే కామెంట్ చేశారు. అయితే ఎక్కడికి వెళుతున్నారనేది మాత్రం చెప్పలేదు. ఇదిలా ఉండగా కాజల్‌, గౌతమ్‌ జంటకు నెటిజన్స్ హ్యాపీ జర్నీ అని కామెంట్స్ పెడుతున్నారు. చదవండి: కాజల్‌ నో చెప్పింది ఇందుకే..

మరిన్ని వార్తలు