పెళ్లికి ముస్తాబవుతున్న కాజల్.. లుక్‌ అదుర్స్‌!‌

30 Oct, 2020 16:50 IST|Sakshi

టాలీవుడ్‌ సినీ ఇండస్ట్రీలో అగ్ర కథానాయికల్లో ఒకరుగా కొనసాగుతున్న కాజల్‌ అగర్వాల్‌ తన పెళ్లి విషయం గురించి చెప్పనప్పటి నుంచి అభిమానుల్లో ఆసక్తి ఆమంతం పెరిగి పోయింది. కొంతమంది అయ్యో మా చందమామకు అప్పుడే పెళ్లి అయిపోతుందనే బాధతో ఉంటే మరికొందరు ఇప్పటికైనా పెళ్లి బంధంలోకి అడుగుపెడుతందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక వారం రోజుల నుంచి కాజల్‌ అగర్వాల్‌ పెళ్లి వార్తనే టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. పెళ్లి ఎలా జరగబోతుంది. ఎవరెవరు హాజరుకానున్నారు. ఏయే వేడుకలు నిర్వహించనున్నారు.. ఇలా ప్రతిదీ ఇంట్రస్టింగ్‌గా మారింది. ఈ క్రమంలో కాజల్‌ తన బ్యాచిలర్‌ జీవితానికి బైబై చెప్పే రోజు రానే వచ్చింది. నేడే చందమామ మూడు ముళ్లు, ఏడడుగుల బంధంతో గౌతమ్‌ కిచ్లుకు భార్యగా మారనుంది. చదవండి: వేడుకల వేళ... ఆనందాల హేల

పెళ్లికి అన్ని ఏర్పాటు పూర్తి చేసుకున్నారు. శుక్రవారం కాజల్‌ తన చిరకాల స్నేహితుడు గౌతమ్‌ కిచ్లును కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహామాడానున్నారు. ఇందుకు ఇప్పటికే ముంబైలోని తన నివాసం నుంచి పెళ్లి జరగబోయే హోటల్‌కు బయలుదేరి వెళ్లారు. అక్కడ పెళ్లికి ముందే నిర్వహించే సంగీత్‌ కార్యక్రమంలో పాల్గొననున్నారు. తాజాగా పెళ్లి కూతురుగా తయారయ్యే ముందు దిగిన బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ‘తుఫాను సంభవించే ముందు ఉండే నిశ్శబ్ధం’ అనే క్యాప్షన్‌తో పోస్టు చేసిన ఈ ఫోటోలో  చేతికి గాజులు, ముఖానికి బొట్టు, నుదుటిన పాపిట బిళ్ళ అలంకరించి పెళ్లి దుస్తులు ధరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ లుక్‌లో కాజల్‌ రిచ్‌, గ్రాండ్‌గా కనిపస్తున్నారు. ఇది చూసిన నెటిజన్లు కుందనపు బొమ్మలా ఉందని కామెంట్‌‌ చేస్తున్నారు. దీనికంటే ముందు మెహెందీ, హల్దీ ఫంక్షన్‌ నిర్వహించగా వీటన్నింటికి చెందిన ఫోటోలను కూడా కాజల్‌ తన సోషల్‌ మీడియా అకౌంట్‌లలో షేర్‌చేస్తూ వస్తోంది. కాజల్‌ ఇంట్లో హల్దీ వేడుక.. వైరల్‌

Calm before the storm 🤍#kajgautkitched

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on

మరిన్ని వార్తలు