తాప్సీని మరోసారి టార్గెట్‌ చేసిన కంగనా

6 Mar, 2021 13:06 IST|Sakshi

 మరోసారి తాప్సీని టార్గెట్‌ చేసిన కంగనా

 ‘సస్తీ’ వ్యాఖ్యలపై ఎదురుదాడి

సాక్షి, ముంబై: బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ మరోసారి ప్ర‌ముఖ నటి తాప్సీని టార్గెట్‌ చేశారు. గతంలో బి గ్రేడ్‌ ఆర్టిస్ట్‌ అంటూ తాప్సీపై నోరు పారేసుకున్న కంగనా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.  మార్చి 3 న జరిగిన ఆదాయపు పన్ను దాడుల గురించి తాప్సీ ట్వీట్ చేసిన కొన్ని గంటల తరువాత కంగనా కౌంటర్‌ ఎటాక్‌ చేశారు.  ముఖ్యంగా ‘సస్తీ కాపీ’ అని రంగోలి చందేల్ చేసిన వ్యాఖ్యను ప్రస్తావించిన తాప్సీపై  ఎదురు దాడికి దిగారు. తాప్సీ ఎలాంటి తప్పు చేయపోతే కోర్టు ద్వారా నిర్దోషిగా బయటకురావాలంటూ సవాల్‌ విసిరారు. (ఐటీ దాడులపై స్పందించిన తాప్సీ)

‘‘నువ్వు ఎప్పటీకి చీప్‌ ఆర్టిస్ట్‌వే.. ఎందుకంటే నువ్వు రేపిస్టుల ఫెమినిస్ట్‌వి. పన్నులు ఎగ్గొట్టిన మీ రింగ్ మాస్టర్ కశ్యప్‌పై 2013లో కూడా దాడులు జరిగాయి. ప్రభుత్వ నివేదిక బయటికి వచ్చింది. నువ్వు నిర్దోషివైతే కోర్టులో నిరూపించుకో’’ అంటూ కంగనా ట్వీట్‌ చేశారు. కాగా తన నివాసంలో ఐటీ సోదాలపై తాప్సీ శనివారం ట్విటర్‌ ద్వారా స్పందించారు. గత మూడు రోజులుగా జరిగిన ఘటనలపై వరుస ట్వీట్ల ద్వారా వివరించారు. పారిస్‌లో తనకు బంగ్లా ఉందంటూ దాని తాళాల కోసం ఐటీ అధికారలు వెతికారని, కానీ అలాంటిదేమీ లేదని తేలిందని వెల్లడించారు. అలాగే రూ. 5 కోట్లు తీసుకున్నానని ఆరోపిస్తూ దాని రశీదులు కోసం వెతికారని, తానెప్పుడూ ఆ మొత్తాన్ని తీసుకోలేదని స్పష్టం చేశారు. అలాగే ఆర్థికమంత్రి  చెప్పినట్లు 2013లో తన నివాసంలో ఐటీ సోదాలు జరిగిన విషయం తనకు గుర్తు లేదంటూ  తాప్సీ ట్వీట్‌ చేశారు.  (అనురాగ్ కశ్యప్‌, తాప్సీలపై ఐటీ దాడులు: రూ.350 కోట్లకు పన్ను ఎగవేత)

కాగా బాలీవుడ్‌‌లో ఐటీ దాడులు క‌ల‌క‌లం రేపిన విష‌యం తెలిసిందే. పన్ను ఎగవేత  ఆరోపణలతో తాప్సీతో పాటు ద‌ర్శ‌క‌నిర్మాత అనురాగ్ క‌శ్యప్, నిర్మాత మ‌ధువ‌ర్మ స‌హా ప‌లువురి ఇళ్లు, ఆఫీసుల్లో ఐటీ అధికారులు  భారీ సోదాలు నిర్వ‌హించారు. (అనురాగ్‌ కశ్యప్‌, తాప్సీ నివాసాలపై ఐటీ దాడులు)

 

మరిన్ని వార్తలు