Karan Johar: లారెన్స్‌ బిష్ణోయ్‌ ముఠా హిట్‌ లిస్ట్‌లో కరణ్‌ జోహార్‌..

20 Jun, 2022 08:19 IST|Sakshi

పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య బాలీవుడ్‌లో కలకలం రేపింది. ఈ మర్డర్‌ను గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ ముఠా పనే అని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ కేసులో అనేక మందిని అరెస్ట్‌ చేశారు. వీరిలో లారెన్స్‌ బిష్ణోయ్‌ అనుచరుడు సిద్ధేష్ కాంబ్లే కూడా ఉన్నాడు. అయితే సిద్ధేష్‌ను విచారించిన పోలీసులకు పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. హిందీ చిత్రపరిశ్రమలోని ప్రముఖ దర్శక నిర్మాత కరణ్‌ జోహార్‌ను కిడ్నాప్‌ చేయాలని ఈ ముఠా అనుకుందట. 

కరణ్‌ జోహార్‌ను అపహరించి ఆయన నుంచి రూ. 5 కోట్లకుపైగా డబ్బు రాబట్టాలని ప్లాన్‌ వేశారట. ప్రస్తుతం ఈ అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్ ఖాన్, ఆయన తండ్రి సలీమ్ ఖాన్‌కు లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో సల్మాన్‌కు పోలీసులు భద్రత కూడా పెంచారు. ఇంతకుముందు కూడా 2018లో కృష్ణజింకను వేటాడిన కేసులో సల్మాన్ ఖాన్‌కు చంపేస్తామన్నా బెదిరింపులు వచ్చాయి. ఇదంతా చూస్తుంటే లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ బాలీవుడ్‌ను టార్గెట్‌ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. 

చదవండి: 👇
రానున్న 'కాఫీ విత్‌ కరణ్' షో 7వ సీజన్‌.. టీజర్ రిలీజ్‌
మరో పెళ్లి చేసుకోబోతున్న సీనియర్‌ హీరో నరేష్‌ !
సినిమా సెట్‌లో ఇద్దరు నటులు మృతి.. ఆరుగురికి గాయాలు
వికటించిన సర్జరీ.. గుర్తుపట్టలేని స్థితిలో హీరోయిన్‌

మరిన్ని వార్తలు