karthika Deepam: మోనిత దీప చావు కోరుకుందని కార్తీక్‌తో చెప్పబోయిన భారతి

29 May, 2021 12:04 IST|Sakshi

కార్తీకదీపం 1052వ ఎపిసోడ్‌ ప్రత్యేకం

కార్తీకదీపం మే 29: దీప ఉన్న ఐసీయూ గది ముందు నిలబడి కార్తీక్‌ నువ్వు బతకాలి దీప అని మనసులో అనుకుంటు దీనంగా చూస్తుంటాడు. ఇంతలో దీప పల్స్‌ రేట్‌ పడిపోవడం ఊపిరి ఆడక కొట్టుకుంటుంది. అది చూసి కంగారుగా వెళ్లి డాక్టర్‌ భారతి, గోవర్థన్‌లను తీసుకువస్తాడు. దీంతో భారతి దీపను చెక్‌ చేస్తుంటే ఏమైంది.. ఏమైందని అడగుతూ ఆడుగుతుంటాడు. భారతి కార్తీక్‌ను బయటకు వెళ్లమని చెబుతుంది. ఇక ఆ తర్వాత బయట దిగులుగా ఉన్న కార్తీక్‌ భారతి వచ్చి దీప కోలుకుందనే శుభవార్త వినిపిస్తుంది. దీపను చూసేందుకు గదిలోకి వెళ్లిన కార్తీక్‌ నిజం తెలుసుకున్న విషయం దీపతో చెబుతాడా లేదా అనేది నేటి(మే 29) ఎపిసోడ్‌ ఇక్కడ చదవండి..

బయట దిగులుగా ఉన్న కార్తీక్‌ దగ్గరికి డాక్టర్‌ భారతి వచ్చి దీప సేఫ్ అని చెప్పడంతో ఒక్కసారిగా అతడి మొహంలో చిరునవ్వు వస్తుంది. వెంటనే దీపను చూడటానికి వెళతానని కదలబోతుండగా భారతి కార్తీక్‌ అని పిలిచి ఆగిపోతుంది. మనసులోనే మోనిత నిజస్వరూపం చెప్పాలి.. ఆమె దీప చావు కోరుకుందని చెప్పేస్తా అనుకుంటుంది. కానీ ఇప్పుడే ఇంత ఆనందంలోనే  ఉన్న కార్తీక్‌ ఈ విషయం చెప్పి మెంటల్‌గా డిస్టర్బ్‌ చేయడం ఎందుకనుకుంటుంది. కానీ ఎప్పటికైనా మోనిత డెంజర్‌ అనే విషయం కార్తీక్‌కు చెప్పి తీరాలని ఆలోచిస్తుంటే. ఇంతలో కార్తీక్‌ ఏంటని అడగడంతో.. దీప సృహలోకి వచ్చింది. ఇప్పుడు నీతో పాటు నడిచి వచ్చేలా ఉందని భారతి అనడంతో కార్తీక్‌ సంతోషంగా అవునా అంటు దీప గదికి వెళ్లబోతుంటే ఇంతతో ఆదిత్య క్యారేజ్ తీసుకుని వస్తాడు. ‘అరే.. ఆదిత్య మీ వదిన సృహలోకి వచ్చిందట.. చూసొస్తాను’ అంటూ పరుగుతీస్తాడు. 

కార్తీక్ దీప గదిలోకి ఆమెనే చూస్తూ.. దీప తలని నిమురుతాడు. ఆ తర్వాత పక్కనే కూర్చుని ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుంటాడు. ‘ఏది నా చదువు?  ఏది నా సంస్కారం.. ఎక్కడో నన్ను నేను పొగొట్టుకున్నాను.. నన్ను నేను వెతుక్కునే సరికి పదేళ్లు పట్టింది.. ఈ పదేళ్లలో నువ్వు అందనంత ఎత్తుకు ఎదుగుతూనే ఉన్నావ్.. నేను అందరానంత పాతాళానికి జారిపోతూనే ఉన్నాను.. ఎంతో మందికి అన్నం పెట్టిన చెయ్యి.. ఇది అన్నపూర్ణమ్మ చెయ్యి.. వంటలక్కా అని ఈసడించుకున్నాను.. ఏది నాకు పాప పరిహారం’ అని చేతిని ముద్దాడతాడు. అలాగే ‘నేను నీ విషయంలో చేసింది మామూలు తప్పు కాదు. మన బిడ్డల పుట్టుకని కూడా అవమానించాను. వీటన్నింటికీ క్షమాపణ చెప్పుకోవాలి. ఎంత మంది ముందైతే అవమానించానో అంతమంది ముందు తలవంచి మరీ క్షమాపణ కోరతాను’ అంటు కన్నీరు పెట్టుకని దీప చేయిని నిమురుతాడు. 

కార్తీక్‌ స్పర్శతో కళ్లు తెరిచిన దీప కార్తీక్‌ మాట్లాడాక, పిల్లల గురించి ఆరా తీస్తుంది. ఆ తర్వాత దీప మోనిత గురించి అడుగుతుంది. అప్పుడే వెళ్లిపోయిందని కార్తీక్ చెప్పడంతో నిజమేనా డాక్టర్ బాబు. లేకపోతే. నేనేమైనా అనుకుంటానని చెబుతున్నారా అని దీప అంటుంది. ‘నేను దాచింది నీ ప్రాణాంతమైన జబ్బు గురించి మాత్రమే. .అంతకు మించి నేను ఏ అబద్దం లేదు. ఏం ఆలోచించకుండా హాయిగా రెస్ట్‌ తీసుకో రేపు ఉదయం నిన్ను డిశ్చార్జ్ చేస్తారు, మన ఇంటికి వెళ్లిపోవచ్చు’ అని బుగ్గమీద ప్రేమగా తట్టుతాడు. కార్తీక్ స్పర్శ తగిలిన వెంటనే దీప తన బుగ్గని తడుముకుంటూ ‘ఈ మత్తులో ఇలా అనిపిస్తుందా.. లేక ఇది నిజమేనా.. డాక్టర్ బాబు ప్రవర్తనలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఇదివరకులా మాట్లాడుతున్నప్పుడు ఎటూ చూడకుండా నా కళ్లలోకి చూస్తూ మాట్లాడుతున్నారు.. ఇక నుంచి జాలి చూపిస్తున్నారా అని అస్సలు అడగను’ అనుకుంటుంది దీప మనసులో..

మరోవైపు మోనిత టాబ్లెట్స్ వేసుకుంటుంది. ప్రియమణి ఈ టాబ్లెట్‌ ఎందుకని ఆరా తీయగా నిజం చెప్పించే టాబ్లెట్‌ అని సమాధానం ఇస్తుంది. ఆ తర్వాత నిన్ను ఒక్కటి అడుగతాడు నిజాయితిగా నిజం చెప్పు అని కార్తీక్ మంచివాడా చెడ్డవాడా. అని అడుగుతుంది. తండ్రిగా, కొడుగ్గా, భర్తగా కార్తీకయ్య బంగారం లాంటోడని, ప్రియుడిగా మాత్రం చెడ్డొడు అంటుంది ప్రియమణి. దీంతో మోనిత కోపంగా చూడటంతో అంటే మిమ్మల్ని కరివేపాకులా చూస్తాడు కదమ్మా అందుకే అలా అన్నానని అనగా.. నువ్వు సూపర్ ప్రియమణి.. నాకు చాలా ప్రశ్నలకు జవాబు దొరికేలా చేశావ్ కీప్ ఇట్ అప్.. వెళ్లు వెళ్లి పని చూసుకో అంటుంది మోనిత. మనసులో నువ్వు భయపడుతూ చెప్పినా నిజమే చెప్పావు ప్రియమణి. కార్తీక్ తన కుటుంబం గురించి తప్పా.. ఈ మోనిత గురించి ఒక్క నిమిషం కూడా ఆలోచించడు. కాబట్టి నువ్వు మాట్లాడిన మాటల్ని బట్టి ఇప్పుడు నేను కార్తీక్ విషయంలో చేస్తున్న పని ఏ మాత్రం తప్పు కాదని అర్ధమైంది అనుకుంటుంది.

కార్తీక్‌ హాస్పిటల్‌ చైర్‌లో నిద్రపోతుంటే.. ఆదిత్య వచ్చి నిద్రలేపుతాడు. అయ్యో ఈ రోజు 8 గంటలకే దీప డిశ్చార్జ్ కదా.. నిద్రపట్టేసింది.. అంటూ కంగారుపడుతుంటే.. ‘అదంతా నేను చూసుకుంటాను.. నువ్వు వదిన దగ్గరకు వెళ్లు’ అంటాడు ఆదిత్య. అక్కడ దీప ఇంటికి వస్తుందని సౌందర్య దేవుడికి పూజా చేసి దండంపెట్టుకుంటుంది. ఇంతలో పిల్లలు అమ్మ ఎప్పుడొస్తుంది అనడంతో.. ‘స్నానాలు చేసి కొత్త బట్టలు వేసుకోండి.. అమ్మ వచ్చేస్తుంది’ అని నచ్చజెప్పి పంపించి.. దేవుడికి థాంక్స్ చెబుతుంది. ‘ఇక మీదట కార్తీక్ దీపలు సంతోషంగా ఉండాలని వేడుకుంటుంది. ఇక దీప లేచి బెడ్ మీద కూర్చుంటుంది. కార్తీక్ దీప రూమ్‌లోకి వెళ్తాడు. మొదటిసారి కార్తీక్‌ దీప తన భార్య స్థానంలో ఇంటికి తీసుకువెళ్లబోతున్నాడు. ఆ తర్వాత ఏం జరగనుందో సోమవారం నాటి ఎపిసోడ్‌లో చూద్దాం. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు