తనకన్నా ఆరేళ్లు చిన్నవాడితో ఆరేళ్లు డేటింగ్‌, పిల్లలు పుట్టాక పెళ్లి

9 Jul, 2022 17:28 IST|Sakshi

Kirsten Dunst  Jesse Plemons Get Married: వివాహబంధంలోకి అడుగు పెట్టే జంటల్లో వరుడి కన్నా వధువు వయసు తక్కువగా ఉంటుంది. కానీ ఇటీవల కాలంలో ఈ హెచ్చుతగ్గులు మారాయి. తన కన్నా తక్కువ వయసు ఉన్న అబ్బాయిలను ప్రేమించి పెళ్లాడుతున్నారు. అలాగే పదుల వయసు తేడా ఉ‍న్నా పురుషులను కూడా మనువాడుతున్నారు నేటితరం యువతులు. ఇక ఏజ్ గ్యాప్‌ పెళ్లి తంతులు సెలబ్రిటీల్లో సర్వసాధారణం. 

ఇప్పటికే ప్రియాంక చోప్రా, అనుష్క శర్మ, కత్రీనా కైఫ్‌, నయన తార వంటి పలువురు స్టార్‌ హీరోయిన్స్‌ తమకన్నా చిన్న ఏజ్‌ వాళ్లని పెళ్లాడారు. తాజాగా ఓ హాలీవుడ్ బ్యూటీ తనకన్నా ఆరేళ్లు చిన్నవాడైన సహానటుడిని పెళ్లి చేసుకుంది. టోబే మాగైర్ నటించిన 'స్పైడర్‌ మ్యాన్' ట్రైయాలజీ ద్వారా పేరు తెచ్చుకుంది హాలీవుడ్‌ హీరోయిన్‌ కిరిస్టెన్‌ డంస్ట్. 40 ఏళ్ల క్రిస్టెన్‌ తనకన్నా ఆరేళ్లు చిన్నవాడైన జెస్సీ ప్లెమోన్స్‌ (34)ను వివాహమాడింది. 'పవర్‌ ఆఫ్‌ ది డాగ్‌' లో కలిసి నటించిన కిరిస్టెన్‌ డంస్ట్, జెస్సీ ప్లెమోన్స్‌ 2016 నుంచి డేటింగ్‌లో ఉన్నారు. 2017 జనవరి 34న వీరిద్దరికీ ఎంగేజ్‌మెంట్‌ కూడా అయింది. వీరు  2018లో కుమారుడు ఎన్నిస్‌, 2021లో జేమ్స్‌ రాబర్ట్‌కు జన్మనిచ్చారు. 

చదవండి: స్టార్‌ నటుడి భార్యపై కేసు.. రూ. 31 లక్షలు తిరిగి ఇవ్వట్లేదని ఫిర్యాదు

ఇదిలా ఉంటే ఇదివరకు హాలీవుడ్‌లో తమకంటే చిన్నవాళ్లైన పురుషులతో రిలేషన్‌షిప్‌లో ఉన్న నటీమణులు చాలానే ఉ‍న్నారు. గేబ్రియెల్‌ యూనియన్‌- డ్వేన్‌ వాడే దంపతులు(9 ఏళ్ల వ్యత్యాసం), షకీరా- గెరాడ్‌ పిక్‌(10 ఏళ్లు), కోర్ట్‌నీ కర్దాషియాన్‌- యూనస్‌ బెడ్జిమా(14 ఏళ్లు), జడా పింకెట్‌ స్మిత్‌- ఆగస్ట్‌ అల్సీనా(21 ఏళ్లు), లీసా బానెట్‌- జాసన్‌ మొమోవా దంపతులు(12 ఏళ్లు) తదితరులు ఈ జాబితాలో ఉన్నారు.

చదవండి: విక్రమ్‌ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్‌ బులిటెన్‌ విడుదల..

మరిన్ని వార్తలు