‍Kollywood Star Vishal: ' అందుకే ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నా'.. విశాల్ సంచలన వీడియో రిలీజ్!

28 Sep, 2023 18:42 IST|Sakshi

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ సంచలన కామెంట్స్ చేశారు. తన మూవీ మార్క్ ఆంటోనీ హిందీ వర్షన్ రిలీజ్‌ కోసం లంచం తీసుకున్నారంటూ వీడియో రిలీజ్ చేశారు. ముంబయిలోని సెంట్రల్ బోర్ట్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్‌ ఆఫీసులో తనకు ఈ అనుభవం ఎదురైందని వెల్లడించారు. ఈ అవినీతిని జీర్ణించుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఈ విషయాన్ని మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే, పీఎం నరేంద్ర మోదీ దృష్టికి తీసుకురావాలని నిర్ణయించుకున్నట్లు వీడియోలో పేర్కొన్నారు. ఈ మేరకు ట్విటర్‌ ద్వారా ఓ వీడియోను విడుదల చేశారు. అంతే కాకుండా ట్వీట్‌తో పాటు మనీ ట్రాన్స్‌ఫర్‌ చేసిన అకౌంట్స్‌ నంబర్లతో సహా పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

(ఇది చదవండి: సైలెంట్‌గా ఓటీటీకి వచ్చేసిన ధోని 'ఎల్‌జీఎమ్‌'... తెలుగు సినిమాలు ఎన్నో తెలుసా?)

విశాల్ ట్వీట్‌లో రాస్తూ..' వెండితెరపై సైతం అవినీతిని చూపిస్తున్నారు. దీన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నా. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో, ముంబైలోని సీబీఎఫ్‌సీ (సెంట్రల్ బోర్ట్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్‌) ఆఫీసులో ఇంకా దారుణం జరుగుతోంది. నా సినిమా మార్క్ ఆంటోనీ హిందీ వర్షన్ కోసం 6.5 లక్షలు చెల్లించాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన 2 లావాదేవీలు చేశా. ఒకటి స్క్రీనింగ్ కోసం రూ.3 లక్షలు, రెండు  సర్టిఫికేట్ కోసం 3.5 లక్షలు చెల్లించాను. నా కెరీర్‌లో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదు. ఈ రోజు సినిమా విడుదలైనప్పటి నుంచి  మధ్యవర్తికి చాలా ఎక్కువ డబ్బు చెల్లించడం తప్ప నాకు వేరే మార్గం కనిపించలేదు. ఈ విషయాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే, మన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దృష్టికి తీసుకోస్తున్నా. నేను ఇలా చేయడం నా కోసం కాదు. భవిష్యత్తులో రాబోయే నిర్మాతల కోసం. నేను కష్టపడి సంపాదించిన డబ్బు అవినీతికి ఇచ్చే అవకాశమే లేదు. అందరి కోసమే నా వద్ద ఉన్న సాక్ష్యాలు కూడా పెడుతున్నా. సత్యం ఎప్పటిలాగే గెలుస్తుందని ఆశిస్తున్నా.' అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 

మరిన్ని వార్తలు