Bigg Boss 7 Nagarjuna: ఈ సీజన్ కోసం నాగ్‌కి అంత డబ్బిస్తున్నారా?

28 Sep, 2023 18:44 IST|Sakshi

తెలుగు 'బిగ్‌బాస్' రియాలిటీ షో ఏడో సీజన్ నడుస్తోంది. ఈ మధ్యనే మూడో వారాలు పూర్తి కాగా, వారానికొకరు చొప్పున ముగ్గురు ఎలిమినేట్ అయిపోయారు. మరోవైపు హౌసులో ఉన్నోళ్లు గొడవలతో ప్రేక్షకుల్ని ఫుల్‌గా ఎంటర్‪‌టైన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ పెద్దగా వర్కౌట్ కావట్లేదు. సరే ఇదంతా పక్కనబెడితే ఇప్పుడు హోస్ట్ నాగార్జున రెమ్యునరేషన్ హాట్ టాపిక్‌గా మారింది.

వేరే లెవల్ మొత్తం
బిగ్‌బాస్‌లో ప్రతి సీజన్‌లో కంటెస్టెంట్స్ మారుతున్నారు. కానీ మూడో సీజన్ నుంచి హోస్ట్‌గా నాగార్జున ఫిక్స్ అయిపోయాడు. గతంలో మంచి జోష్ అండ్ ఎనర్జీతో హోస్టింగ్ చేసిన నాగార్జున ప్రస్తుత సీజన్‌లో ఇంప్రెస్ చేసే విషయంలో కాస్త తడబడుతున్నాడు. కానీ రెమ్యునరేషన్ మాత్రం కళ్లు చెదిరిపోయే రేంజులో తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. 

(ఇదీ చదవండి: అనుకోకుండా కిస్.. వాంతి చేసుకున్న 'కేజీఎఫ్' బ్యూటీ)

అన్ని కోట్లు రెమ్యునరేషన్?
హోస్ట్ నాగార్జున.. 'బిగ్‌బాస్' మూడో సీజన్ కోసం రూ.5-8 కోట్లు, నాలుగో సీజన్ కోసం రూ.8-10 కోట్లు, ఐదో సీజన్ కోసం రూ.12 కోట్లు, ఆరో సీజన్ కోసం రూ.16 కోట్లు తీసుకున్నారుట. అయితే ఏడో సీజన్‌కి వచ్చేసరికి నంబర్ కాస్త పెరిగినట్లు టాక్ వినిపిస్తుంది. ఎపిసోడ్‌కి రూ.15 లక్షల వరకు తీసుకుంటున్నారని.. అలా సీజన్ మొత్తానికి కలిపి రూ.20 కోట్ల వరకు ఆ మొత్తం ఉంటుందని అంటున్నారు. అయితే ఇవన్నీ సోషల్ మీడియాలో వినిపిస్తున్న లెక్కలే అని మీరు గుర్తుంచుకోవాలి!

షో ఎలా నడుస్తోంది?
ప్రస్తుత సీజన్‌నే తీసుకుంటే తొలి రెండు వారాలు కాస్త డల్‌గానే సాగింది. మూడో వారానికి వచ్చేసరికి కాస్త ఊపు వచ్చినట్లు అనిపించింది. కానీ మళ్లీ నార్మల్ అయిపోయింది. ప్రస్తుతం హౌసులో 11 మంది ఉన్నారు. తొలి మూడు వారాల్లో కిరణ్ రాథోడ్, షకీలా, దామిని ఎలిమినేట్ అయిపోయి బిగ్‌బాస్ నుంచి బయటకెళ్లిపోయారు. ఈ వారం నామినేషన్స్‌లో ఏడుగురు ఉండగా రతిక లేదా టేస్టీ తేజ ఎలిమినేట్ అయ్యే సూచనలు గట్టిగా కనిపిస్తున్నాయి.

(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 37 సినిమాలు)

మరిన్ని వార్తలు