తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి ఎవరంటే..?

9 Dec, 2023 15:33 IST|Sakshi

తెలంగాణలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలను టాలీవుడ్‌ ఆసక్తిగా గమనిస్తోంది. రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల తర్వాత కాంగ్రెస్‌ పార్టీకి అధికారంలోకి రావడంతో.. కొత్త ప్రభుత్వం ఇండస్ట్రీ పట్ల ఎలా వ్యవహరిస్తుంది? ప్రభుత్వ సపోర్ట్‌ ఎంతవరకు ఉంటుంది? సినిమాటోగ్రపీ మంత్రి ఎవరు.. అనే చర్చలు టాలీవుడ్‌లో మొదలయ్యాయి. నేడు మంత్రులకు శాఖలు కేటాయించారు. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రిగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు. 

అంతకు ముందు వరుసగా రెండు సార్లు సినిమాటోగ్రఫీ మంత్రిగా తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పని చేశారు. సినిమా ఈవెంట్స్‌లో రెగ్యులర్‌గా పాల్గొంటూ ఆయన చిత్రపరిశ్రమకు దగ్గరగానే ఉన్నారు.  బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కూడా పరిశ్రమ అభివృద్ధికి సహకరించింది. ఇక కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇండస్ట్రీ పట్ల ఎలా వ్యవహరిస్తుందో వేచి చూడాలి.

ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు నంది అవార్డులను ఇచ్చింది. కానీ తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత ఆ అవార్డులు కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యాయి. కొత్త  ప్రభుత్వం అయినా పెద్ద మనసు చేసుకొని ఆ అవార్డులను ఇస్తుందా లేదా అని టాలీవుడ్‌ పెద్దలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. త్వరలోనే సినిమాటోగ్రఫీ మంత్రిని కలిసి తమ సమస్యలను వినిపించుకునేందుకు టాలీవుడ్‌ పెద్దలు రెడీ అవుతున్నారు. 

>
మరిన్ని వార్తలు