బాక్సాఫీస్‌ వద్ద తలపడుతున్న స్టార్‌ హీరోలు.. ఎవరు గెలుస్తారో?

9 Dec, 2023 15:33 IST|Sakshi

ఆరంభ దశలో కమలహాసన్‌, రజనీకాంత్‌ కలిసి పలు చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇద్దరు విడివిడిగా కథానాయకులుగా నటించడం మొదలెట్టారు. అప్పటి నుంచి వీరిద్దరి చిత్రాల మధ్య పోటీ నెలకొనేది. ఆ తర్వాత ఇద్దరి సినిమాలను ఒకేసారి విడుదల చేయకుండా జాగ్రత్తపడుతూ వచ్చారు. అలాంటిది కమల్‌ హాసన్‌ నటించిన ఆళవందాన్‌, రజనీకాంత్‌ నటించిన ముత్తు చిత్రాలు ఒకేరోజు విడుదలై బాక్సాఫీస్‌ వద్ద ఢీకొన్నాయి. కమల్‌ హాసన్‌ హీరోగా, విలన్‌గా ద్విపాత్రాభినయం చేసిన చిత్రం ఆళవందాన్‌.

22 ఏళ్ల తర్వాత రీరిలీజ్‌
మనీషా కొయిరాలా, రవీనా టండన్‌ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి సురేష్‌ కృష్ణ దర్శకత్వం వహించారు. వి.క్రియేషన్‌ పతాకంపై కలైపులి ఎస్‌.థాను నిర్మించిన ఈ భారీ యాక్షన్‌ కిల్లర్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం 2001లో విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంది. తాజాగా 22 ఏళ్ల తర్వాత ఈ చిత్రాన్ని నిర్మాత థాను కొత్త హంగులతో డిజిటల్‌ ఫార్మెట్‌లో రూపొందించి ప్రపంచ వ్యాప్తంగా 1000 థియేటర్లలో విడుదల చేశాడు.

జపాన్‌లోనూ సెన్సేషనల్‌ హిట్‌
ఇకపోతే రజనీకాంత్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ముత్తు. మీనా కథానాయికగా నటించిన ఇందులో శరత్‌బాబు, రాధారవి, సెంథిల్‌ ముఖ్యపాత్రలు పోషించారు. కేఎస్‌ రవికుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1995లో విడుదలై సంచలన విజయాన్ని సాధించింది. అనూహ్య విజయాన్ని సాధించడంతోపాటు జపాన్‌లోనూ రజనీకాంత్‌కు బోలెడంత అభిమాన గణాన్ని తెచ్చిపెట్టింది. కమల్‌ హాసన్‌ నటించిన ఆళవందాన్‌, రజనీకాంత్‌ నటించిన ముత్తు చిత్రాలు శుక్రవారం రీ రిలీజ్‌ అయ్యాయి. దీంతో ఇప్పుడు ఈ రెండు చిత్రాలు సాధించే వసూళ్లపై ఆసక్తి నెలకొంది.

చదవండి: రెండు నెలల తర్వాత సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు చిత్రం!

>
మరిన్ని వార్తలు