నేను చనిపోలేదు: నటుడు

11 Sep, 2020 20:26 IST|Sakshi

ఒకరి బదులు మరొకరి పేరు ట్వీట్‌ చేసిన నటుడు

ఇంటర్నెట్‌ వినియోగం.. సోషల్‌ మీడియా వాడకం పెరిగాక చాలా మంది ప్రముఖులు ఎదుర్కొన్న అతి పెద్ద సమస్య వారు బతికుండగానే.. చనిపోయారనే వార్తలు రావడం. నిజమే కదా బతికుండగానే.. చనిపోయారంటూ వార్తలు వస్తే.. పాపం వారికి ఎలా ఉంటుంది. ఇదేదో యూట్యూబ్‌ వెబ్‌సైట్‌ల పని అయితే జనాలు చాలా వరకు నమ్మరు. కానీ పాపం అప్పుడప్పుడు నటులు కూడా ఇలాంటి తప్పులే చేస్తారు. తాజాగా వీరి జాబితాలోకి హిందీ టీవీ నటుడు కర్ణవీర్‌ బోహ్రా చేరారు. ఆ వివరాలు.. కర్ణవీర్‌ స్నేహితుడు కుశాల్‌ పంజాబీ గత ఏడాది డిసెంబర్‌ 26న మరణించారు. డిప్రెషన్‌ కారణంగా తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నారు. ఈ క్రమంలో ఆయన స్నేహితుడు, సహా నటుడు కర్ణవీర్‌ బోహ్రా మెంటల్‌ హెల్త్‌ అవేర్‌నెస్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ మేరకు ట్వీట్‌ చేస్తూ.. ఈ విషయాన్ని ఇతరులకు షేర్‌ చేయాల్సిందిగా మరి కొందరిని ట్యాగ్‌ చేశాడు.

అంతా బాగానే ఉంది కానీ చనిపోయింది కుశాల్‌ పంజాబీ అయితే.. కర్ణవీర్‌ తప్పుగా కుశాల్‌ టాండన్‌ అని టైప్‌ చేశాడు. ఇది కాస్త వైరల్‌ కావడంతో.. కుశాల్‌ తాను బతికే ఉన్నానంటూ ట్వీట్‌ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. అప్పటికి గాని కర్ణవీర్‌కు తన తప్పేంటో అర్థం కాలేదు. వెంటనే క్షమాపణ కోరుతూ.. టైపింగ్‌ మిస్టెక్‌ అని తెలిపాడు. ప్రస్తుతం వీరిద్దరి ట్విట్టర్‌ సంభాషణ తెగ వైరలవుతోంది. 

మరిన్ని వార్తలు