Naga Chaitanya: 'అమీర్‌ ఖాన్‌కు కృతజ్ఞతలు.. ఆయన నుంచి చాలా నేర్చుకున్నా'

8 Aug, 2022 09:18 IST|Sakshi

అమీర్‌ఖాన్‌ కథానాయకుడిగా నటిం, సొంతంగా నిర్మించిన చిత్రం లాల్‌ సింగ్‌ చడ్డా. కరీనాకపూర్‌ నాయికగా నటింన ఈ త్రం ద్వారా టాలీవుడ్‌ స్టార్‌ నటుడు నాగచైతన్య ప్రత్యేక పాత్రలో బాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. కులకర్ణీ కథను అందింన ఈ త్రానికి అద్వైత్‌ చందన్‌ దర్శకత్వం వహించారు. చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 11వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. కాగా చిత్రాన్ని తమిళనాడులో ఉదయనిధి స్టాలిన్‌కు చెందిన రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ సంస్థ విడుదల చేస్తోంది.

ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్‌ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఆదివారం మధ్యాహ్నం చెన్నైలోని సత్యం థియేటర్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయనిధి స్టాలిన్‌ మాట్లాడుతూ అమీర్‌ ఖాన్‌ తన అభిమాన నటుడన్నారు. లాల్‌ సింగ్‌ చద్దా చిత్రాన్ని తమిళనాడులో విడుదల చేయా ల్సిందిగా ఆయనే స్వయంగా వీడియో కాల్‌ చేసి కోరారని, మరో మాట లేకుండా అందుకు అంగీకరింనట్లు చెప్పారు. తాను సినిమా చూశాననీ అద్భుతంగా ఉందన్నారు. తమిళ నేటివిటీకి తగ్గట్టుగా చిన్న చిన్న సచనలు చేయగా వాటిని అమలు పరచారన్నారు.

చిత్రాన్ని సాధ్యమైనంత వరకు అత్యధిక థియేటర్లల్లో విడుదల చేస్తామని అమీర్‌ ఖాన్‌కు మాట ఇస్తున్నాని అన్నారు. అమీర్‌ ఖాన్‌ మాట్లాడుతూ.. రచయిత కులకర్ణి సుమారు 14 ఏళ్లుగా ఈ చిత్ర కథపై దృష్టి పెట్టారని, తానూ ఏడాదిన్నర పాటు ఈ కథతో ట్రావెల్‌ చేసినట్లు చెప్పారు. కథ నచ్చడంతో సినిమా చేశామన్నారు. ఉదయనిధి స్టాలిన్‌ రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ సంస్థ తమ చిత్రాన్ని తమిళనాట విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ చిత్రం తమిళ ప్రేక్షకులకు నచ్చుతుందనే అభిప్రాయాన్ని అమీర్‌ ఖాన్‌ వ్యక్తం చేశారు.

నటుడు నాగచైతన్య మాట్లాడుతూ.. తాను చెన్నై కుర్రాడినేనని, 18 ఏళ్లు ఇక్కడే పెరిగానని అన్నారు. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా తొలిసారి చెన్నైకి రావడం సంతోషకరం అన్నారు. లాల్‌ సింగ్‌ చడ్డా చిత్రంలో  నటించే అవకాశం కల్పించిన అమీర్‌ ఖాన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన నుంచి చాలా నేర్చుకున్నానని అన్నారు.  

మరిన్ని వార్తలు