CWG 2022 Womens Doubles Badminton: కాంస్యం నెగ్గిన గోపిచంద్‌ తనయ

8 Aug, 2022 09:15 IST|Sakshi

బర్మింగ్‌హామ్‌ వేదికగా జరుగుతున్న 22వ కామన్‌వెల్త్‌ క్రీడల్లో భారత షట్లర్ల హవా కొనసాగుతోంది. పురుషుల, మహిళల సింగల్స్‌లో లక్ష్యసేన్‌, పీవీ సింధు.. పురుషుల డబుల్స్‌ సెమీస్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ షెట్టి జోడీ ఇదివరకే ఫైనల్‌కు చేరగా.. పదో రోజు ఆఖర్లో పురుషుల సింగల్స్‌లో కిదాంబి శ్రీకాంత్‌, మహిళల డబుల్స్‌లో ట్రీసా జాలీ, పుల్లెల గోపీచంద్‌ తనయ గాయత్రి గోపిచంద్‌ జోడీ కాంస్య పతకాలు సాధించారు.

కాంస్య పతక పోరులో ట్రీసా-గాయత్రి ద్వయం.. ఆస్ట్రేలియాకు చెందిన చెన్‌ సుయాన్‌ యు వెండి-గ్రోన్యా సోమర్‌విల్లే జోడీపై 21-15, 21-19 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించింది. ట్రీసా-గాయత్రి ద్వయం ఇదే ఎడిషన్‌ మిక్సడ్‌ టీమ్‌ ఈవెంట్‌లో భారత్‌ రజతం నెగ్గిన జట్టులో సభ్యులుగా ఉన్నారు. ట్రీసా-గాయత్రి జోడీ కాంస్యంతో బ్యాడ్మింటన్‌లో భారత పతకాల సంఖ్య 3కు (రజతం, 2 కాంస్యాలు), ఓవరాల్‌గా భారత పతకాల సంఖ్య 54కు చేరింది. 
చదవండి: కాంస్యం నెగ్గిన దినేశ్‌ కార్తీక్‌ భార్య.. భారత్‌ ఖాతాలో 50వ పతకం

మరిన్ని వార్తలు