బాలరాజు.. ‘మల్లిక’ వచ్చేసింది

24 Oct, 2020 13:18 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టాలీవుడ్ యువ హీరో కార్తికేయ నటిస్తున్న తాజా చిత్రం ‘చావు కబురు  చల్లగా’.  ఈ సినిమాలో కార్తికేయ ‘బస్తీ బాలరాజు’  పాత్రలో కనపించనున్నాడు. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను శనివారం చిత్ర యూనిట్ విడుదల చేసింది. హీరోయిన్‌గా నటిస్తున్న లావణ్య త్రిపాఠి సంబంధించిన పాత్రను పరిచయం చేసింది. లావణ్య ఇందులో ‘ మల్లిక’ పాత్రలో కనిపించనున్నారు.

ఫప్ట్ లుక్‌ పోస్టర్‌ను లావణ్య తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘చావు కబురు చల్లగా’ మూవీలో ఇదే నా ఫస్ట్ లుక్‌’ అంటూ కాప్షన్‌ జత చేశారు.  నీలం రంగు చుడీదార్ ధరించి ఉన్న ఈ కొత్త లుక్‌లో లావణ్య నెటిజన్లను ఆకట్టుకున్నారు. ఇప్పటికే కార్తికేయ ‘బస్తీ బాలరాజు’ ఫస్ట్‌ లుక్‌ను చిత్ర యూనిట్‌ రిలీజ్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు అల్లు అరవింద్‌ బ్యానర్‌ గీతా ఆర్ట్స్‌పై బ‌న్నీ వాసు నిర్మాతగా వ్యహరిస్తున్నారు.  నూతన దర్శకుడు కౌశిక్‌ పెగ‌ళ్ల‌పాటి తెరకెక్కిస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు