'మధురపూడి గ్రామం అనే నేను' మూవీ రివ్యూ

13 Oct, 2023 16:27 IST|Sakshi

టైటిల్: మధురపూడి గ్రామం అనే నేను
రచన-దర్శకత్వం: మల్లి,
నిర్మాతలు: కేఎస్ శంకర్ రావు, ఆర్ వెంకటేశ్వరరావు,
సంగీతం: మణిశర్మ,
సినిమాటోగ్రఫీ: సురేష్ భార్గవ్
విడుదల తేదీ: అక్టోబరు 13

శివ కంఠ‌మ‌నేని హీరోగా మల్లి ద‌ర్శ‌క‌త్వంలో తీసిన సినిమా 'మ‌ధుర‌పూడి గ్రామం అనే నేను'. మ‌ణిశ‌ర్మ సంగీతమందించారు. ముప్పా వెంక‌య్య చౌద‌రి సార‌థ్యంలో జి. రాంబాబు యాదవ్ సమర్పణలో లైట్ హౌస్ సినీ మ్యాజిక్ ప‌తాకంపై కేఎస్ శంకర్ రావు, ఆర్. వెంకటేశ్వరరావు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

కథేంటి?
మధురపూడి అనే ఊరు తన ఆత్మకథ చెబుతుంది. ఈ ఊరిలో సూరి (శివ కంఠమనేని) అనే మొండోడు. తన స్నేహితుడు బాబ్జీ కోసం ఎంత వ‌ర‌కైనా నిలబడతాడు. అలాంటి సూరి జీవితంలోకి హీరోయిన్ (క్యాథ‌లిన్ గౌడ) ఎంట్రీ ఇస్తుంది. ఆమె వచ్చాక సూరి జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి. ఊర్లోని రాజకీయాలకు సూరికి సంబంధమేంటి? అస‌లు ఈ క‌థ‌కు 700 కోట్ల రూపాయ‌ల డిజిట‌ల్ స్కామ్‌కు సంబంధం ఏంటి అనేది స్టోరీ.

ఎలా ఉందంటే?
ఓ కథలో రివేంజ్, పొలిటిక్స్, లవ్, యాక్షన్, డ్రామా ఇలా అన్ని కమర్షియల్ అంశాలు ఉండటం విశేషం. 'మధురపూడి గ్రామం అనే నేను' ఇలాంటి అంశాలతో తీసిన చిత్రం. పాత్రలు ప్రేక్షకుల మదిలో రిజిస్ట‌ర్ అయ్యేసరికి కాస్త టైమ్ ప‌ట్ట‌ింది. దీంతో ఫస్టాప్ అంతా నిదానంగా సాగింది. ఇంటర్వెల్‌కు ఆసక్తి పెరుగుతుంది. ద్వితీయార్దం పర్వాలేదనిపించింది. ప్రీ క్లైమాక్స్‌, క్లైమాక్స్‌లో ట్విస్టులు ఆకట్టకున్నాయి. క్లైమాక్స్‌లో యాక్టర్స్ ఫెర్ఫార్మెన్స్, దర్శకుడి పనితీరు కనిపించింది.

ఎవరెలా చేశారు?
సూరి పాత్రలో శివ కంఠ‌మ‌నేని చక్కగా నటించాడు. అన్నిరకాల ఎమోషన్స్‌ని బాగా చేశాడు. హీరోయిన్ క్యాథ‌లిన్ గౌడ ఓకే అనిపించింది. క‌థ‌లో కీల‌క‌మైన హీరో స్నేహితుడిగా బాబ్జీ పాత్రను మలిచిన తీరు బాగుంది. భ‌ర‌ణి శంక‌ర్ ఫరిది మేర నటించాడు. వ‌నితా రెడ్డి, జ‌బ‌ర్దస్త్ నూక‌రాజు, మ‌హేంద్ర‌న్ తదితరులు పర్వాలేదనిపించారు. టెక్నికల్‌ విషయాలకొస్తే మణిశర్మ పాటలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సురేశ్ భార్గవ్ విజువ‌ల్స్ చక్కగా ఉన్నాయి నిర్మాణ విలువలు సినిమాకి తగ్గట్లు ఉన్నాయి. 

మరిన్ని వార్తలు