Chiranjeevi-Keerthi Suresh: చిరంజీవి చెల్లెలుగా మహానటి!

7 Aug, 2021 09:01 IST|Sakshi

Chiranjeevi Vedalam Remake: మహానటితో కీర్తి సురేశ్‌ దశ తిరిగిపోయింది. ఆమె అందానికి, అభినయానికి దాసోహమైంది ప్రేక్షక లోకం. అప్పటి నుంచి కీర్తి డిఫరెంట్‌ సినిమాలను ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో హీరోయిన్‌గానే కాకుండా పాత్ర నచ్చితే సపోర్టింగ్‌ రోల్స్‌ చేసేందుకూ సై అంటోంది. అందులో భాగంగా సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న అన్నాత్తే సినిమాలో రజనీ సోదరిగా కీర్తి నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆమె మరోసారి చెల్లిగా నటించేందుకు రెడీ అవుతుందట!

తమిళ హిట్‌ మూవీ 'వేదాళం' తెలుగులో రీమేక్‌ అవుతున్న విషయం తెలిసిందే కదా! మెహర్‌ రమేశ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవి హీరోగా నటించనున్నాడు. ఇందులో మెగాస్టార్‌ సోదరిగా సాయిపల్లవి లేదా కీర్తి సురేశ్‌ను తీసుకోవాలనుకున్నారట. అందులో భాగంగా తొలుత కీర్తిని సంప్రదించగా ఆమె గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు టాక్‌ వినిపిస్తోంది. మరి చిరంజీవి చెల్లెలుగా మహానటి ఓకే అయిందా? లేదా? అన్నది తెలియాలంటే చిత్రయూనిట్‌ అధికారికంగా ప్రకటించేవరకు వేచి చూడాల్సిందే!

మరిన్ని వార్తలు