త్రివిక్రమ్‌-మహేశ్‌బాబు సినిమా షూటింగ్‌ అప్పుడే..

5 Sep, 2022 04:16 IST|Sakshi

‘అతడు’ (2005),  ‘ఖలేజా’(2010) చిత్రాల తర్వాత హీరో మహేశ్‌బాబు, దర్శకుడు త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ముచ్చటగా మూడోసారి ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ఈ నెల రెండోవారం నుంచి ప్రారంభం కానుందనే టాక్‌ వినిపిస్తోంది.

తొలుత ఓ యాక్షన్‌ ఎపిసోడ్‌ను ప్లాన్‌ చేశారట చిత్రబృందం. ‘మహర్షి’ చిత్రం తర్వాత మహేశ్‌బాబు, పూజాహెగ్డే జంటగా నటిస్తున్న సినిమా ఇది. చినబాబు (ఎస్‌.రాధాకృష్ణ) నిర్మిస్తున్న ఈ మూవీ 2023 ఏప్రిల్‌ 28న రిలీజ్‌ కానుంది.


 

మరిన్ని వార్తలు