బ్రదర్‌ అండ్‌ సిస్టర్‌

4 Aug, 2020 02:12 IST|Sakshi

రాఖీ పండగ సందర్భంగా ‘మోసగాళ్లు’ సినిమా టీమ్‌ ఒక విషయం చెప్పింది. అదేంటంటే.. ఇందులో విష్ణు–కాజల్‌ అగర్వాల్‌ బ్రదర్‌ అండ్‌ సిస్టర్‌ పాత్రలు చేస్తున్నారని ప్రకటించింది. హాలీవుడ్‌–ఇండియన్‌ ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకున్న ఈ సినిమాకి లాస్‌ ఏంజెల్స్‌కు చెందిన జెఫ్రీ గీ చిన్‌ దర్శకత్వం వహించారు. 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ బ్యానర్‌పై విష్ణు మంచు నిర్మించగా, ఏవీఏ ఎంటర్‌టై¯Œ మెంట్‌ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించింది.

సోమవారం రాఖీ పండగ సందర్భంగా విష్ణు మంచు, కాజల్‌ అగర్వాల్‌ పోస్టర్‌ని విడుదల చేశారు. మంచు విష్ణు మాట్లాడుతూ– ‘‘అతిపెద్ద ఐటీ కుంభకోణం నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఈ వేసవిలోనే ‘మోసగాళ్లు’ విడుదల కావాల్సి ఉండగా, కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా విధించిన లాక్‌డౌ¯Œ తో వాయిదా పడింది. సినిమా ఎప్పుడు విడుదలయ్యేదీ త్వరలోనే ప్రకటిస్తాం’’ అన్నారు. సునీల్‌ శెట్టి, రుహీ సింగ్, నవీన్‌ చంద్ర, నవదీప్‌ ఇతర కీలక పాత్రలు చేసిన ఈ చిత్రానికి కెమెరా: షెల్డన్‌ చౌ.

మరిన్ని వార్తలు