ఆ హిట్‌ డైరెక్టర్‌తోనే వైష్ణవ్ తేజ్ నెక్స్ట్‌ మూవీ

4 May, 2021 20:26 IST|Sakshi

తొలి సినిమా ఉప్పెన తోనే బాక్సాఫీస్‌ బద్దలు కొట్టిన మెగా హీరో వైష్ణవ్‌ తేజ్‌. తొలి చిత్రంతోనే తనదైన నటనతో సముద్రమంత క్రేజ్‌ సంపాదించుకొని ఓవర్‌నైట్‌ స్టార్‌ అయ్యాడు. దీంతో  వైష్ణవ్ తేజ్‌కి ఆఫర్స్ వెల్లువెత్తుతున్నాయి. ఉప్పెన రిలీజ్‌ కాకముందే క్రిష్ డైరెక్షన్‌లో ఓ సినిమాను పూర్తి చేశాడు. అయితే అది ఇంకా రిలీజ్‌ కాలేదు. తొలి సినిమాతోనే బంపర్‌ సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన ఈ కుర్ర హీరో కోసం దర్శకనిర్మాతలు క్యూ కట్టేస్తున్నారు. ఇప్పటికే తమిళ 'అర్జున్ రెడ్డి' దర్శకుడు గిరీశయ్య దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలె దీనికి సంబంధించిన పూజా కార్యక్రమం పూర్తయ్యింది.

ఇది కాకుండా మైత్రీ మూవీస్ బ్యానర్ లో రెండు సినిమాల డీల్ కి కూడా ఓకె చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం వైష్ణవ్‌..తన నాలుగో సినిమాను భీష్మ డైరెక్టర్‌ వెంకీ కుడుములతో చేయనున్నాడు. వైష్ణవ్‌ కోసం వెంకీ కుడుముల మంచి కథను రెడీ చేశాడని, దీనికి వైష్ణవ్‌ కూడా ఓకే చేసినట్లు సమాచారం. నితిన్‌ కెరియర్‌లోనే భీష్మ మంచి కంబ్యాక్‌ చిత్రంగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ మెగా హీరోకు కూడా మరో బంపర్‌ హిట్‌ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడట. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానుంది. మరి ఈ సినిమాలో వైష్ణవ్‌కు జోడీగా ఎవరు ఉంటారన్నది ఇంకా ఫైనల్‌ కాలేదు. 

చదవండి : పెళ్లికి రెడీ అవుతున్న అరియానా! వరుడు ఎవరంటే..
యాంకర్‌ అనసూయ భర్త జాబ్‌ ఏంటో తెలుసా?

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు