Minister Srinivas Goud: ఇలాంటి చిత్రాలు భావితరాలకు అవసరం

4 Jun, 2022 10:37 IST|Sakshi

మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

‘‘ప్రజలను చైతన్యవంతులను చేయాలనే మంచి కాన్సెప్ట్‌తో తీస్తున్న ‘సాచి’ సినిమా పెద్ద విజయం సాధించాలి. ఇలాంటి సినిమాలు భావితరాలకు అవసరం’’ అని తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌  అన్నారు. సంజన, మూలవిరాట్‌ అశోక్‌ రెడ్డి ప్రధాన పాత్రల్లో  వివేక్‌ పోతిగేని దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘సాచి’. సత్యానంద్‌ స్టార్‌ మేకర్స్‌ సమర్పణలో ఉపేన్‌ నడిపల్లి, వివేక్‌ పోతిగేని నిర్మిస్తున్న ఈ చిత్రం శుక్రవారం ప్రారంభమైంది.

తొలి సన్నివేశానికి సత్యానంద్‌ మాస్టర్‌ కెమెరా స్విచ్చాన్‌ చేయగా, మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ క్లాప్‌ కొట్టారు. నిర్మాత రామ్మోహన్‌ రావు గౌరవ దర్శకత్వం వహించారు. వివేక్‌ పోతిగేని మాట్లాడుతూ– ‘‘ఖమ్మంలో జరిగిన వాస్తవ ఘటనతో ‘సాచి’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాను’’ అన్నారు. ‘‘తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో నిర్మిస్తున్నాం’’ అన్నారు ఉపేన్‌ నడిపల్లి. ఈ చిత్రానికి సంగీతం: వి. భరద్వాజ్‌.

మరిన్ని వార్తలు