నాగశౌర్య లుక్‌ అదుర్స్‌

27 Jul, 2020 10:51 IST|Sakshi

సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వంలో నాగశౌర్య నటిస్తున్న చిత్రం ప్రీ లుక్‌ని చిత్ర యూనిట్‌ విడుదల చేసింది.  ‘ది గేమ్‌ విల్‌ నెవర్‌ బీ ది సేమ్‌’ (ఆట ఎప్పుడూ ఒకేలా ఉండదు) అనే క్యాప్షన్‌తో దీనిని రిలీజ్‌ చేశారు. ఇక ఇందులో నాగశౌర్య మునుపెన్నడు చూడని విధంగా సిక్స్‌ ప్యాక్‌ బాడీతో డిఫరెంట్‌ లుక్‌తో కనిపిస్తున్నాడు. ఈ లుక్‌ చూసి ఆయన అభిమానులు మురిసిపోతున్నారు .  లవర్‌ బాయ్‌లా కనిపించే నాగ శౌర్య పూర్తిగా మారిపోయాడంటూ కామెంట్‌ చేస్తున్నారు. బాడీ షేప్‌ బాగుందంటూ కితాబిస్తున్నారు. 

చదవండి: ఆట ఎప్పుడూ ఒకేలా ఉండదు!

ఇక అభిమానులతో పాటు సెలబ్రెటీలు కూడా నాగశౌర్య కొత్త సినిమా  ప్రీ లుక్‌పై స్పందిస్తున్నారు. నారా లోహిత్‌ ‘లుక్‌ డిఫరెంట్‌, ఇంకా నువ్వు బెటర్‌ అవ్వాల్సింది ఏం లేదు. నీతో ఎవరు మ్యాచ్‌ అవలేరు. టీం అందరికి ఆల్‌ ద బెస్ట్’ అంటూ ట్వీట్‌ చేశాడు.  పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ వారు ‘ఇది చూస్తుంటే అప్పుడే గెలిచినట్టు అనిపిస్తోంది. ఈ ఫోటోలో అద్భుతంగా కనిపిస్తున్నారు’ అంటూ ట్వీట్‌ చేశారు. మరోవైపు దర్శకుడు శేఖర్‌ కమ్ముల ‘నారాయణదాస్‌ పుట్టిన రోజు నాడు ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. సినిమా సక్సెస్‌ కావాలని కోరుకుంటున్నాను’ అంటూ ట్వీట్‌ చేశారు.   

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు