ఆ సమయంలో తొమ్మిది రోజులు నీళ్లు కూడా ముట్టుకోలేదు: నాగ‌శౌర్య‌

9 Dec, 2021 20:40 IST|Sakshi

నాగశౌర్య హీరోగా సంతోష్ జాగర్లమూడి తెరకెక్కించిన చిత్రం లక్ష్య. డిసెంబర్ 10న ఈ చిత్రం విడుదల కానుంది.  కేతిక శర్మ  హీరోయిన్‌గా నటించింది. సోనాలి నారంగ్ సమర్ఫణలో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రై. లి. బ్యానర్లపై నారాయణ్ దాస్ కే నారంగ్, పుస్కర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మించారు. సినిమా విడుదల సందర్భంగా హీరో నాగ‌శౌర్య మీడియాతో మాట్లాడుతూ..

వరుడు కావలెను సినిమా నా పరిధికి సంబంధించినది. అలాంటి సబ్జెక్ట్ ఎన్ని సార్లు చేసినా సక్సెస్ అవుతుందన్న నమ్మకం దర్శక నిర్మాతలకు ఉంది. ఆ నమ్మకాన్ని ప్రేక్షకులు మరోసారి నిరూపించారు. ఇప్పుడు లక్ష్య సినిమా రాబోతోంది. లక్ష్య ఇంకా పెద్ద సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నాను. కథ విన్న వెంటనే నా వైపు నుంచి వంద శాతమివ్వాలని అనుకున్నాను. కొత్త నాగ శౌర్యను చూపించాలని అనుకున్నాను. ఇలాంటి కథలు రావడమే అదృష్టం. ఇలాంటివి వచ్చినప్పుడు యాక్టర్స్ ఎవ్వరైనా ఓ అడుగు ముందుకు వేస్తారు. నేను కూడా అదే చేశానని తెలిపారు. ఏ ఆట అయినా సరే ప్రొఫెషనల్‌గా వెళ్లాలంటే చాలా కష్టమని. కానీ ఈ సినిమా కోసం ఆర్చరీని నేర్చుకున్నట్లు చెప్పుకొచ్చాడు.

కథ డిమాండ్‌ చేస్తే ఏ యాక్టర్ అయినా సిక్స్ ప్యాక్ చేస్తారు. కరెక్ట్ స్క్రిప్ట్ పడితే అందరం చాలా కష్టపడతాం. ఈ సినిమా షూటింగ్‌ చేస్తున్నప్పుడు దాదాపు తొమ్మిది రోజులు కనీసం నీళ్లు కూడా ముట్టుకోలేదని’’ అన్నారు. ‘‘ 35 కేజీలను వెనక్కి లాగడం మామూలు విషయం కాదని ఎన్నో గాయాలు కూడా అవుతుంటాయి. ఈ సినిమా కోసం మూడు రోజులు మాత్రమే శిక్షణ తీసుకున్నాను. దేశంలోనే ఆర్చరీ నేపథ్యంలో రాబోతోన్న మొదటి సినిమా లక్ష్య. నా కెరీర్‌లోనూ స్పోర్ట్స్ బేస్డ్ సినిమాను చేయడం ఇదే మొదటి సారి. ఇది వరకు కూడా క్రీడా నేపథ్యంలోని కథలు నా వద్దకు వచ్చాయి. కానీ ఇది బాగా నచ్చిందని చెప్పారు. 

చదవండి: Bigg Boss Telugu 5: సిరిది సిగ్గులేని జన్మ, ఆయన కాళ్లు కడిగి నెత్తిన చల్లుకో

మరిన్ని వార్తలు