వైల్డ్‌ డాగ్‌ ఎటు వెళ్తుంది?

4 Jan, 2021 06:14 IST|Sakshi

నాగార్జున హీరోగా నూతన దర్శకుడు అహిషోర్‌ సల్మాన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘వైల్డ్‌ డాగ్‌’. అన్వేష్‌ రెడ్డి నిర్మించారు. దియా మిర్జా, సయామీ ఖేర్‌ కథానాయికలుగా నటించారు. ఎన్‌ఐఏ (నేషనల్‌ ఇన్వెస్టిగేటివ్‌ ఏజెంట్‌) ఆఫీసర్‌ విజయ్‌ వర్మ పాత్రలో నాగార్జున కనిపిస్తారు. లాక్‌డౌన్‌ తర్వాత చిత్రీకరణ ప్రారంభించిన తొలి పెద్ద చిత్రమిది. ఇటీవలే షూటింగ్‌ పూర్తయింది. ఈ సినిమాను థియేటర్స్‌లో కాకుండా ఓటీటీలో విడుదల చేస్తారనే వార్త ప్రచారంలో ఉంది. ఈనెల 26న ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేయనున్నారన్నది ఆ వార్త సారాంశం. అయితే ఈ సినిమా థియేటర్స్‌లోనే విడుదల అవుతుందని కూడా వినిపిస్తోంది. మరి వైల్డ్‌ డాగ్‌ ఎటు వెళ్తుంది? వేచి చూడాలి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు