విక్రాంత్‌ రోణ పోస్టర్‌ పెట్టాలని ఉంది!

27 Jul, 2022 00:27 IST|Sakshi
అనూప్‌ బండారి, నాగార్జున, సుదీప్‌

– నాగార్జున

‘‘తెలుగు ప్రేక్షకులది మంచి మనసు. వారికి సినిమా నచ్చిందంటే పెద్ద హిట్‌ చేస్తారు. త్రీడీ సినిమాలు వచ్చి చాలా రోజులైంది. ‘విక్రాంత్‌ రోణ’తో ఆ ఎక్స్‌పీరియన్స్‌ను మరోసారి చూడబోతున్నారు. ట్రైలర్‌ అదిరిపోయింది. సినిమా కూడా పెద్ద విజయం సాధిస్తుంది’’ అని అన్నారు నాగార్జున. సుదీప్‌ టైటిల్‌ రోల్‌లో అనూప్‌      బండారి దర్శకత్వంలో రూపొందిన కన్నడ చిత్రం ‘విక్రాంత్‌ రోణ’. నీతూ అశోక్, నిరూప్‌ బండారి, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ కీలక పాత్రలు పోషించారు.

జాక్‌ మంజునాథ్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 28న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా మంగళవారం జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న నాగార్జున మాట్లాడుతూ – ‘‘సుదీప్‌ ఇప్పటికే హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో నటించేశారు. అందరికీ సుదీప్‌ నటుడిగా సుపరిచితుడు. సాధారణంగా అన్నపూర్ణ స్టూడియోస్‌లో చిత్రీకరించిన కొన్ని సినిమాలకు సంబంధించిన పోస్టర్స్‌ను మేం పెడుతుంటాం.

ఆ సినిమాల్లో మేం కూడా భాగమయ్యామనే గర్వంతో అలా చేస్తాం. ఇంతకుముందు ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ పెట్టాం. ఇప్పుడు ‘విక్రాంత్‌ రోణ’ పోస్టర్‌ పెట్టాలని      ఉంది’’ అన్నారు. ‘‘నేను థియేటర్స్‌లో చూసిన తొలి సినిమా నాగార్జునగారి ‘శివ’. అప్పట్లో సైకిల్‌ చైన్‌తో కొట్టడం అనేది స్టయిల్‌గా మారిపోయింది. నేనూ సైకిల్‌ చైన్‌ను బ్యాగ్‌లో పెట్టుకున్నాను. ఇక ‘విక్రాంత్‌ రోణ’ సినిమా షూటింగ్‌ దాదాపు      70 శాతం అన్నపూర్ణ సెవెన్‌ ఏకర్స్‌లోనే జరిగింది.

‘ఈగ’, ‘బాహుబలి’, ‘సైరా: నరసింహారెడ్డి’ చిత్రాల్లో యాక్టర్‌గా నన్ను తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. ‘విక్రాంత్‌ రోణ’ను కూడా ఆద     రించి, హిట్‌ చేయాలి’’ అన్నారు సుదీప్‌.     ‘‘నాగార్జునగారి ‘గీతాంజలి’ సినిమాకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేశాను. ఇక నా తొలి స్క్రిప్ట్‌ సుదీప్‌గారి కోసమే రాసుకున్నాను. ‘విక్రాంత్‌ రోణ’ నా     ఇరవయ్యేళ్ల కల. సుదీప్‌గారితో వర్క్‌ చేయడం సంతోషంగా ఉంది’’ అన్నారు అనూప్‌ బండారి. 

మరిన్ని వార్తలు