‘బిగ్‌ బాస్‌’కి షాక్‌.. నాగార్జున గుడ్‌ బై!

5 Oct, 2020 19:40 IST|Sakshi

బిగ్‌ బాస్‌ సీజన్‌ 3 హోస్ట్‌గా మెప్పించిన కింగ్‌ నాగార్జున సీజన్‌ 4లోనూ తన టాలెంట్‌ను ప్రూవ్‌ చేసుకుంటున్నారు. షోలో సెల‌బ్రెటీలు పెద్ద‌గా లేక‌పోయినా, తన టైమింగ్‌ పంచ్‌లు, వాక్చాతుర్యంతో బిగ్‌ బాస్‌ సీజన్‌ 4ని అదరగొడుతున్నారు. వారాంతంలో వస్తూ షో టీఆర్పీ రేటును అమాంతం పెంచేస్తున్నారు. ఇక నిన్నటి బిగ్‌బాస్ సీజన్ 4 నాలుగు వారాలు పూర్తి చేసుకొని ఐదో వారంలోకి అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో ఓ షాకింగ్‌ న్యూస్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కొన్నాళ్ల పాటు నాగార్జున బిగ్‌ బాస్‌ షోకి దూరంగా ఉంటారని ఆ వార్తల సారాంశం. దానికి కారణంగా వైల్డ్‌ డాగ్‌ మూవీ అని తెలుస్తోంది. 
(చదవండి : అభి, అఖిల్‌ మధ్య ఫైట్‌.. భోరుమన్న మోనాల్‌)

కింగ్ నాగార్జున దర్శకుడు సోలోమన్ దర్శకత్వంలో వైల్డ్ డాగ్ అనే ఓ యాక్షన్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఎప్పుడో పూర్తి కావాల్సిన ఈ సినిమా షూటింగ్‌.. కరోనా వల్ల వాయిదా పడింది. త్వ‌ర‌లో థాయ్ లాండ్‌లో కీల‌క‌మైన షెడ్యూల్ జ‌ర‌గ‌బోతోంది. క‌నీసం 20 రోజుల పాటు.. షూటింగ్ సాగ‌నుంద‌ట‌. ఈ 20 రోజులూ బిగ్ బాస్ కి నాగ్‌ డుమ్మా కొట్ట‌బోతున్నాడ‌ట. శ‌ని, ఆది వారాల‌లో నాగ్ తెర‌పై క‌నిపిస్తాడు. అంటే దాదాపు 6 ఎపిసోడ్ల‌లో నాగ్ క‌నిపించ‌డు. ఆయా ఎపిసోడ్ల‌ని ఎవ‌రితో భ‌ర్తీ చేయాలి? అనే విష‌యంలో బిగ్ బాస్ నిర్వాహ‌కులు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డుతున్నారట. గతంలో లాగా రమ్యకృష్ణతో కానీ లేదా ఇంకెవరితోనైనా షోను రన్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట బిగ్‌బాస్ నిర్వాహకులు. అస‌లే ఈసారి బిగ్ బాస్ పై జ‌నాల‌కు అస‌క్తి అంతంత మాత్రంగానే ఉంది. ఇలాంటి సమయంలో నాగ్ కూడా వెళ్లిపోతే.. షోకి కొంచెం నష్టం తప్పదనే చెప్పాలి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు