మరోసారి స్టేట్‌మెంట్‌ ఇచ్చిన సిద్దిఖీ భార్య

13 Sep, 2020 17:33 IST|Sakshi

లక్నో : బాలీవుడ్‌ విలక్షణ నటుడు  నవాజుద్దీన్ సిద్దిఖీ భార్య అలియా ఆదివారం ఉత్తరప్రదేశ్‌లోని బుధాన పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్నారు. గతంలో ఆమె తన కుటుంబంపై ముంబై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. ఆ తరువాత సాంకేతిక కారణాలతో ఆ కేసును పోలీసులు బుధాన్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. దీంతో పోలీసుల పిలుపు మేరకు ఆదివారం అక్కడకు చేరుకుని తన వాగ్మూలం నమోదు చేశారు. కాగా నవాజుద్దీన్ సిద్దిఖీ నుంచి విడిపోవాలని కోరుకుంటు అలియా ఇది వరకే విడాకుల నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. సిద్దిఖీతో తనకున్న మనస్పర్ధాలతో పాటు ఆయన సోదరుడు  షామాస్‌, కుటుంబ సభ్యులు కూడా కారణమని పేర్కొన్నారు.  ఈ మేరకు మే 7న నోటీసులు పంపినట్లు అలియా తరఫు లాయర్‌ అభయ్‌ తెలిపారు. విడిపోయిన అనంతరం అలియాకు చెల్లించాల్సిన భరణం గురించి కూడా ఇందులో ప్రస్తావించినట్లు పేర్కొన్నారు. దీనిలో భాగంగానే నవాజుద్దీన్‌, ఆయన కుటుంబంపై అలియా తీవ్ర ఆరోపణలు చేశారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు