‘రంగ్‌దే’ ఓటీటీలోకి వచ్చేసింది.. ఎప్పుడంటే

29 May, 2021 08:54 IST|Sakshi

నితిన్‌, కీర్తి సురేశ్‌ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'రంగ్‌దే'. మార్చి 26న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా పర్వాలేదనిపించింది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందించాడు. ఇక ఈ సినిమా ట్రైలర్ రీలీజైన నాటి నుంచి చిత్రంపై హైప్‌ క్రియేట్‌ అయ్యింది. దీనికి తోడు నితిన్‌-కీర్తి చేసిన ప్రమోషన్‌ వీడియోలు ఆకట్టుకున్నాయి. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ నేపథ్యంలో సాగిన ఈ చిత్రం పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఇక ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్‌ చేయడానికి రంగం సిద్ధమైంది.  జూన్‌ 12 నుంచి జీ5లో రంగ్‌దే సినిమా స్ర్టీమింగ్‌ కానుంది. దీనికి సంబంధించి జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు