నితిన్‌ బర్త్‌డే: మాస్ట్రో టీజర్‌ వచ్చేసింది

30 Mar, 2021 18:20 IST|Sakshi

యంగ్‌ హీరో నితిన్‌ బర్త్‌డే నేడు. ఈ సందర్భంగా నితిన్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘మాస్ట్రో’ మూవీ ఫస్ట్‌లుక్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసి అభిమానులను సర్‌ప్రైజ్‌ చేసింది. మొదట అంధాదున్‌ అనే వర్కింగ్‌ టైటిల్‌తో షూటింగ్‌ ప్రారంభించి ఈ మూవీకి ‘మాస్ట్రో’ అనే టైటిల్‌ ఖారారు చేసినట్లు మూవీ మేక​ర్స్‌ స్పష్టం చేశారు. అంతేగాక నితిన్‌ బర్త్‌డే సందర్భంగా ఈ రోజు సాయంత్ర మూవీ నుంచి మరో అప్‌డేట్‌ కూడా రానున్నట్లు మూవీ యూనిట్‌ చెప్పింది.

చెప్పినట్లుగానే మేకర్స్‌ ‘మాస్ట్రో’ టీజర్‌ను విడుదల చేసి అభిమానులకు డబుల్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. కాగా ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌కు పాజిటివ్‌ రెస్పాన్స్‌ వస్తుండగా.. టీజర్‌ ప్రేక్షకులను మరింత ఆకట్టుకంటోంది. ఈ మూవీలో న‌భా న‌టేష్ నితిన్‌తో జ‌త‌క‌ట్ట‌నుండ‌గా, మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా కీల‌క పాత్ర పోషిస్తుంది. మేర్ల‌పాక గాంధీ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రాన్ని నితిన్ తండ్రి సుధాక‌ర్ రెడ్డి నిర్మిస్తున్నారు. జూన్‌ 11న ఈ మూవీ విడుదల కానుంది. 

చదవండి: 
నితిన్‌ బర్త్‌డే వేడుకల్లో సింగర్‌ సునీత దంపతులు

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు