ఆర్‌ఆర్‌ఆర్‌పై ఢిల్లీ దెబ్బ.. టెన్షన్‌లో రాజమౌళి!

29 Dec, 2021 14:38 IST|Sakshi

ఇంకో తొమ్మిది రోజుల్లో(జవవరి 7) పాన్‌ ఇండియా చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌  ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌ స్పీడ్‌ పెంచేశాడు రాజమౌళి.. మరోవైపు దేశంలో కరోనా మళ్లీ విజృంభించింది. ఒమిక్రాన్‌ దెబ్బకి ఢిల్లీలో ఎల్లో అలర్ట్‌ని కూడా ప్రకటించాడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌. దీంతో దేశ రాజధానిలో సినిమా థియేటర్స్‌ మూతపడ్డాయి. ఒక్క ఢిల్లీలోనే కాకుండా.. మహారాష్ట్ర, చెన్నై, కేరళ, గుజరాత్‌ వంటి రాష్ట్రాల్లోనూ ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో తెలియదు.

అయినప్పటికీ తగ్గేదే అంటున్నాడు రాజమౌళి. అనుకున్న సమయానికే సినిమాను విడుదల చేస్తామని ప్రకటించారు. అంతేకాదు ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌ మొత్తాన్ని వెంటేసుకొని దేశమంతా ప్రచారానికి వెళ్తున్నాడు. ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌ లాంటి మహా నగరాలన్నింటిలోనూ ప్రమోషన్స్‌ కార్యక్రమాలు చేపట్టారు. ఓ వైపు సినిమా వాయిదా పడుతున్నట్లు పుకార్లు వస్తున్నా.. వాటిని పట్టించుకోకుండా ప్రచారంలో బిజీ అయిపోయాడు రాజమౌళి. మరి జనవరి 7 నాటికి దేశంలో పరిస్థితి ఎలా ఉంటుందో? ఒకవేళ మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఒమిక్రాన్‌ కేసులు పెరిగి థియేటర్స్‌ మూసివేస్తే ఎలా? అనుకున్న సమయానికే సినిమాను విడుదల చేస్తారా లేదా వెనకడుగు వేస్తారా వేచి చూడాల్సిందే. 

మరిన్ని వార్తలు