తెలుగువారికి గర్వకారణం

30 Sep, 2022 04:12 IST|Sakshi
పైడి జయరాజ్‌ జయంతి వేడుకల్లో జైహింద్‌ గౌడ్, కవిత..

– నిర్మాత శ్రావణ్‌ గౌడ్‌

‘‘మూకీల సమయంలోనే తెలంగాణ ప్రాంతం నుండి బాలీవుడ్‌కి వెళ్లి, హీరోగా నిలదొక్కుకున్న పైడి జయరాజ్‌గారి జీవితం నేటి తరాలకు స్ఫూర్తి’’ అని నిర్మాత శ్రావణ్‌ గౌడ్‌ అన్నారు. బాలీవుడ్‌లో మొదటి తరం హీరోల్లో ఒకరిగా స్టార్‌ ఇమేజ్‌ అందుకున్నారు దివంగత తెలుగు నటుడు పైడి జయరాజ్‌.

సెప్టెంబర్‌ 28న ఆయన 113వ జయంతి. ఈ సందర్భంగా ‘సర్దార్‌ పాపన్న’ హీరో పంజాల జైహింద్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో పైడి జయరాజ్‌ జయంతి వేడుకలు జరిగాయి. ‘‘కరీంనగర్‌కు పైడి జయరాజ్‌గారి పేరు ప్రకటించాలి.. అలాగే పైడి జయరాజ్‌ పేరుతో అవార్డ్స్‌ ఇవ్వాలి’’ అన్నారు జైహింద్‌ గౌడ్‌ .

మరిన్ని వార్తలు