పాయల్‌కి ఆ ఫార్ములా మళ్లీ వర్కవుట్‌ అవుతుందా?

3 May, 2021 10:38 IST|Sakshi

ఆర్ ఎక్స్ 100 సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది పాయల్‌ రాజ్‌పుత్‌. మొదటి సినిమాతోనే డేరింగ్ స్టెప్‌ తీసుకొని నెగటివ్‌ షేడ్‌లో కనిపించింది. తన అందంతో కుర్రాళ్ల మనసు కొళ్లగొట్టిన ఈ భామ సినిమాల కంటే హాట్‌ ఫోటో షూట్‌లతో యూత్‌లో బాగా క్రేజ్‌ సంపాదించుకుంది. వెంకీమామ, డిస్కో రాజా వంటి సినిమాల్లో నటించినా ఈ అమ్మడికి పెద్దగా అవకాశాలు రాలేదు. అనగనగా ఓ అతిథి సినిమాలో డీ గ్లామర్‌ పాత్రలో కనిపించి మంచి మార్కులు కొట్టేసింది.

ఆహాలో రిలీజైన ఈ సినిమా పాజిటివ్‌ టాక్‌ సంపాదించుకున్న పాయల్‌కు మాత్రం పెద్ద సినిమాలేవీ రాలేదు. దీంతో ఇప్పుడు వెబ్‌ సిరీస్‌ చేయడానికి సై అంటుంది ఈ ఢిల్లీ భామ. అంతేకాకుండా ఇందులో నెగిటివ్‌ రోల్‌ చేయనుందట. ఆహాలో రానున్న ‘త్రీ రోజెస్’ అనే వెబ్‌ సిరీస్‌లో పాయల్‌ పాత్ర చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండనున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ వెబ్‌ సిరీస్‌ స్ర్టీమింగ్‌ కానుంది. దీంతో మొదటి సినిమాతోనే నెగిటివ్‌ రోల్‌తో హిట్‌ కొట్టిన పాయల్‌ వెబ్‌ సిరీస్‌తోనూ ఆకట్టుకుంటుందా అన్నది చూడాల్సి ఉంది. మొత్తానికి ఈ ముద్దుగుమ్మకు నెగిటివ్‌ షేడ్‌ కలిసొచ్చేలా ఉంది. 

చదవండి : పాయల్‌ నెంబర్‌ చెప్పండంటూ ఆమె ప్రియుడికి రిక్వెస్ట్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు