‘పెళ్లి సందD’ కి క్రేజీ ఆఫ‌ర్... ఓటీటీలో విడుదలకు సిద్దం!

28 May, 2021 16:50 IST|Sakshi

కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా థియేటర్లు మూతబడడంతో సినీ ప్రియులకు ఓటీటీ వేదికలు కీలకమైన ప్రత్యామ్నాయాలుగా మారాయి.  కరోనా ముందు ఓటీటీ వేదికలు ఉన్నాయనే విషయం చాలా మందికి తెలియదు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏదో ఒక ఓటీటీ వేదికలో సభ్యత్వం తీసుకుని ఇంట్లో కూర్చొని హాయిగా సినిమాలు చూస్తున్నారు. ప్రేక్షకుల అభిరుచి తగ్గట్లుగా ఓటీటీ సంస్థలు ఢిపరెంట్‌,  ఢిపరెంట్‌ కంటెంట్‌ని అందుబాటులోకి తీసుకోస్తుంది. ఇక థియేటర్లు ఇప్పట్లో తెరిచే పరిస్థితి లేకపోవడంతో చిన్న, మీడియం సినిమాలు మెల్లిమెల్లిగా ఓటీటీ బాట పడతున్నాయి.

ఇప్పటికే ఈ వారంలో ‘ఏక్‌ మినీ కథ’, ‘అనుకోని అతిథి’లాంటి సినిమాలు ఓటీటీలో విడుదలయ్యాయి. తాజాగా మరో టాలీవుడ్‌ మూవీ ఓటీటీలో విడుదల కాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో రూపొందుతున్న ‘పెళ్లి సందD’ఓటీటీ నుంచి క్రేజీ ఆఫ‌ర్ వ‌చ్చింద‌ని స‌మాచారం. రెండు ప్రముఖ ఓటీటీ సంస్థలు ‘పెళ్లి సందD’ని కొనేందుకు ముందుకు వచ్చాయని, అవి ప్రకటించిన ఆఫర్లు కూడా నిర్మాతకు లాభాన్ని తెచ్చిపెట్టేలా ఉన్నాయని, ఎప్పుడైనా ఈ డీల్ ఓకే అయిపోవొచ్చ‌ని వార్తలు వినిపిస్తున్నాయి. మ‌రి నెట్టింట వినిపిస్తోన్న ఈ వార్తలు చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి. 

ఇక ‘పెళ్లి సందD’ విషయానికొస్తే... శ్రీకాంత్‌ హీరోగా నటించిన పెళ్లి సందడికి సీక్వెల్‌ ఇది.  శ్రీకాంత్ తనయుడు రోషన్, శ్రీలీలా జంటగా నటిస్తున్న ఈ సినిమాని కె.రాఘవేంద్రరావు దర్శకత్వం పర్యవేక్షణలో గౌరీ రోనంకి తెరకెక్కిస్తున్నారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు