-

నవ్వులే నవ్వులు

27 Nov, 2023 03:14 IST|Sakshi

చంద్రశేఖర్, సోనాలి పాణిగ్రాహి, అశోక్‌ వర్ధన్ , యాదమ్మ రాజు, అప్పారావు, బేబీ ప్రేక్షిత ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ప్లాంట్‌ మ్యాన్‌’. కె.సంతోష్‌ బాబు దర్శకత్వం వహించారు. డీఎం యూనివర్సల్‌ స్టూడియోస్‌పై పన్నా రాయల్‌ నిర్మించిన ఈ సినిమా డిసెంబర్‌లో విడుదలకానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు.

పన్నా రాయల్‌ మాట్లాడుతూ–‘‘కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా ‘ప్లాంట్‌ మ్యాన్‌’. ప్రారంభం నుంచి చక్కని వినోదం ఉంటుంది. ఒక కొత్త అంశం కూడా ఉంది.. అందుకే ఈ సినిమాకి ‘ప్లాంట్‌ మ్యాన్ ’ అనే టైటిల్‌ నిర్ణయించాం. ఈ చిత్రం తర్వాత కూడా మా బేనర్‌లో కొత్తవారిని పరిచయం చేస్తూ సినిమాలు నిర్మిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: పీఎస్‌. మణికర్ణన్ , నేపథ్య సంగీతం: వినోద్‌ యాజమాన్య, సంగీతం: ఆనంద బాలాజీ, నిర్మాత–దర్శకత్వ పర్యవేక్షణ: పన్నా రాయల్‌. 

మరిన్ని వార్తలు