నా మాజీ భర్త వల్లే సినిమాలకు దూరం: నటి

4 Jun, 2021 15:13 IST|Sakshi

'విషకన్య' చిత్రంతో వెండితెరపై అడుగు పెట్టింది బాలీవుడ్‌ నటి పూజా బేడీ. చేసింది తక్కువ సినిమాలే అయినా ఎక్కువ పాపులారిటీ సంపాదించుకుందావిడ. తెలుగులో 'చిట్టమ్మ మొగుడు', 'శక్తి' సినిమాల్లోనూ సహాయక పాత్రల్లో కనిపించి తెలుగు ప్రేక్షకులను అలరించింది. పెళ్లి తర్వాత వెండితెరకు దూరమైన పూజా బేడీ దీనికి తన మాజీ భర్త ఫర్హాన్‌, అతడి కుటుంబమే కారణమని చెప్తోంది.

'నా మాజీ భర్త ఫర్హాన్‌ పెళ్లికి ముందే నాతో ఈ విషయం చెప్పాడు. అతడి కుటుంబం సాంప్రదాయాలకు ఎక్కువ విలువిస్తుందని, పెళ్లయ్యాక నేను సినిమాల్లో నటించడం కుదరదన్నాడు. అప్పుడు నాకు నా తల్లి చెప్పిన మాట గుర్తొచ్చింది. మీరేం చేసినా అందులో 100 శాతం ఇవ్వాల్సిందేనని అమ్మ మాకు పదే పదే చెప్పేది. ఇక అప్పుడు నేను సాధారణ గృహిణిగానే ఉండిపోతానని ఫిక్సయ్యా. అప్పటివరకు సాగిన సినీప్రయాణాన్ని వదిలేసి, కొత్త జర్నీ మొదలు పెట్టాలనుకున్నాను. అనుకున్నట్లుగానే అన్నింటికీ ఫుల్‌స్టాప్‌ పెట్టేసి ఉత్తమ భార్యనయ్యాను' అని పూజా చెప్పుకొచ్చింది.

కాగా పూజా బేడీ ఫర్హాన్‌ను 1994లో పెళ్లి చేసుకుంది. వీరికి ఆలయ, ఒమర్‌ అని ఒక కూతురు, కొడుకు ఉన్నారు. తర్వాతి కాలంలో పూజా, ఫర్హాన్‌ మధ్య సఖ్యత కుదరకపోవడంతో 2003లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఆమె జలక్‌దిక్‌లాజా 1, నాచ్‌ బలియే 3, హిందీ బిగ్‌బాస్‌ 5వ సీజన్స్‌లో కంటెస్టెంట్‌గా బుల్లితెర మీద నానా హంగామా చేసింది.

చదవండి: సోనమ్‌ను ఏడిపిస్తారా? అంటూ హీరో ప్రతాపం! చివరికి..

ఆగిన MI-7 షూటింగ్​..టామ్​ క్రూజ్​కి కరోనా!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు